ఆసియా క్రికెట్ కప్ జట్టు ప్రకటించింది బీసీసీఐ. 17 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు అజిత్ అగార్కర్. ఆసియా కప్ లో టీమిండియా తరపున ఆడే ఆటగాళ్ల వివరాలు..
జట్టు : రోహిత్ శర్మ ( కెప్టెన్ ), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కె.ఎల్.రాహుల్, ఇషాంత్ కిషన్, హార్ధిక్ పాండ్యా ( వైస్ కెప్టెన్ ), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర పటేల్, కుల్ దీప్ యాదవ్, బూమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ, సంజూ శాంసన్ ( స్టాండ్ బై )
ఆసియా కప్ లో ఆడే 17 మంది టీమిండియా జట్టును ప్రకటించగా.. అయ్యర్, కె.ఎల్.రాహుల్ రీ ఎంట్రీ ఇచ్చారు జట్టులోకి.
ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. ఆగస్ట్ 30వ తేదీ నుంచి మ్యాచ్ లు ప్రారంభం అవుతున్నాయి. శ్రీలంక, పాకిస్తాన్ దేశాల్లో మ్యాచులు జరగనున్నాయి.