దుబాయ్ : టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, విమెన్స్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు ఐసీసీ అవార్డులు లభించాయి. జూన్ నెలకు ప్రకటించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ పురస్కారాలను ఈ ఇద్దరు గెలుచుకున్నారు. టీ20 వరల్డ్ కప్లో విశేషంగా రాణించిన బుమ్రా 15 వికెట్లతో టాప్లో నిలిచాడు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ, రెహమానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్తాన్) నుంచి పోటీ ఎదురైనా బుమ్రాను ఈ అవార్డు వరించింది.
ఈ అవార్డు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ తర్వాత తనకు లభించిన మరో అద్భుతమైన పురస్కారమని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో 343 రన్స్ చేయడం మంధానకు కలిసొచ్చింది. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. సఫారీలపై టీమ్ పెర్ఫామెన్స్ చాలా బాగుందని అందులో తన పాత్ర కూడా ఉండటం సంతోషాన్నిచ్చిందని మంధాన వ్యాఖ్యానించింది.