న్యూఢిల్లీ: డెంగ్యూ ఫీవర్ కారణంగా టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. అఫ్గానిస్తాన్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా సోమవారం వెల్లడించింది. టీమ్‌తో పాటు అతను ఢిల్లీకి వెళ్లకుండా ప్రస్తుతం చెన్నైలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది. ‘గిల్ కొద్దిగా కోలుకున్నాడు.
ఇది అనుకూల సంకేతాలే అయినా పూర్తి స్థాయిలో కోలుకోవాల్సి ఉంది. రోజు వారీగా అతని ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీమ్ అంచనా వేస్తోంది’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులో చేర్చారు.