T20 World Cup 2024: హోటళ్లలో చిక్కుకుపోయిన టీమిండియా.. అమెరికా బార్బడోస్‌లో తుఫాన్

T20 World Cup 2024: హోటళ్లలో చిక్కుకుపోయిన టీమిండియా.. అమెరికా బార్బడోస్‌లో తుఫాన్

వరల్డ్ కప్ సాధించిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వెస్టిండీస్ లో ఉద్భవించిన బెరిల్ హరికేన్ కారణంగా టీమిండియా బార్బడోస్ లో  అక్కడే చిక్కుకుపోయింది. హరికేన్ కారణంగా అవుట్‌బౌండ్ విమానాలన్నీ రద్దు చేశారు. విమానాశ్రయంతో పాటు  బార్బడోస్‌లో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. 

బార్బడోస్ లో ప్రస్తుతం ఎమర్జెన్సీ నడుస్తోన్నట్లు తెలుస్తుంది. దీంతో భారత క్రికెటర్లకు కోరుకున్న సౌకర్యాలు అందడం లేదని సమాచారం. టీమిండియా ఉంటున్న హోటల్ చాలా తక్కువ మంది సిబ్బందితో పని చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత జట్టు జూలై 1న భారత్ బయలుదేరాల్సి ఉంది. అయితే ఈ దశలో హరికేన్ కారణంగా బార్బడోస్ చాలా అప్రమత్తంగా ఉంది. సోమవారం (జూలై 1) మధ్యాహ్నం వరకు విమానాశ్రయం మూసివేసి వేస్తున్నట్టు ఉండనట్లు తెలుస్తోంది. హరికేన్ తగ్గిన తర్వాత మాత్రమే తిరిగి తెరిచే అవకాశం ఉండొచ్చు.

Also Read:మనోళ్లే ఆరుగురు.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన ఐసీసీ 

శనివారం (జూన్ 29) బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీ.. 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 169/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది.