స్పెషల్ ఫ్లైట్లో స్వదేశానికి చేరుకున్న టీమిండియా జట్టు

 స్పెషల్ ఫ్లైట్లో  స్వదేశానికి చేరుకున్న టీమిండియా జట్టు


టీ-20వరల్డ్ కప్ గెలిచి భారత్ లో అడుగుపెట్టిన టీమిండియాకు  గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. వారిని అభినందించేందుకు దూర ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. జాతీయ జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు. వరల్డ్ కప్ ట్రో ఫీని ఫ్యాన్స్ కు చూపిస్తూ అభివాదం చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ తర్వాత  ప్రత్యేక భద్రత మధ్య ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు ఇండియన్ క్రికెటర్లు, కోచ్, సిబ్బంది. 

జూన్ 29 న సౌతాఫ్రికాతో జరిగిన టీ-ట్వింటీ ఫైనల్స్ లో విజయం సాధించి.. పొట్టి కప్పును సొంతం చేసుకుంది భారత జట్టు. ఆదివారమే టీం ఇండియాకు రావాల్సి ఉండగా.. బార్బడోస్ లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడే ఉండిపోయింది. నిన్న కాస్త హరికేన్ ప్రభావం తగ్గడంతో ప్రత్యేక విమానం భారత జట్టు బయలు దేరి..ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.  చాలా ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు గ్రాండ్ వెల్కం చెప్పారు క్రికెట్ లవర్స్. 

ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు రోహిత్ నేతృత్వంలోని టీమిండియా సభ్యులు. మోదీతో  సమావేశం ముగిశాక..విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి బయలు దేరుతారు.   సాయంత్రం 5 గంటలకు ముంబయిలో  రోడ్ షో ప్రారంభం అవుతుంది. రెండు గంటల పాటు సాగే ఊరేగింపులో రోహిత్ సేన.. ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో  అభిమానులకు అభివాదం చేస్తారు.  రాత్రి వాంఖండే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మానం జరగనుంది.