రాజ్‌కోట్ టెస్ట్ టీమిండియా సాధించిన టెస్ట్ విజయాల్లో ఒకటిగా నిలిచిపోనుంది. 577 టెస్టుల చరిత్రలో.. పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. ప్రత్యర్థి జట్లను ఇన్నింగ్స్ తేడాతో మట్టికరిపించినా.. ఈ విజయం మాత్రం సువర్ణధ్యాయమే. 557 పరుగుల భారీ ఛేదనలో ఇంగ్లీష్ జట్టు 122 పరుగులకే కుప్పకూలి.. రోహిత్ సేనకు 434 పరుగుల భారీ విజయాన్ని అందించింది. గతంలో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం.
పరుగుల పరంగా టెస్టుల్లో టీమిండియా అతి పెద్ద విజయాలు
- 434 vs ఇంగ్లండ్ (రాజ్‌కోట్, 2024)
- 372 vs న్యూజిలాండ్ (ముంబై, 2021)
- 337 vs సౌతాఫ్రికా (ఢిల్లీ, 2015)
- 321 vs న్యూజిలాండ్ (ఇండోర్, 2016)
- 320 vs ఆస్ట్రేలియా (మొహాలి 2008)
టెస్టుల్లో టీమిండియా అతి పెద్ద విజయాలు
- ఇన్నింగ్స్ & 272 పరుగుల తేడాతో vs వెస్టిండీస్ (రాజ్‌కోట్, 2018)
- ఇన్నింగ్స్ & 262 పరుగుల తేడాతో vs ఆఫ్ఘనిస్తాన్ (బెంగళూరు, 2018)
- ఇన్నింగ్స్ & 239 పరుగుల తేడాతో vs బంగ్లాదేశ్ (మీర్పూర్, 2007)
- ఇన్నింగ్స్ & 239 పరుగుల తేడాతో vs శ్రీలంక (నాగపూర్, 2007)
- ఇన్నింగ్స్ & 222 పరుగుల తేడాతో vs శ్రీలంక (మొహాలి, 2022)