టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి సరికొత్త షాట్ ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హనుమ విహారి ఈ సరికొత్త షాట్ ను ఆడాడు. ఈ మ్యాచ్ లో మణికట్టుకు గాయం అయినా సరే విహారి నా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో నే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒంటి చేత్తో రైట్ హ్యాండర్ అయిన విహారి లెఫ్టాండ్ బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు..ఒకటే చేత్తో బౌండరీలను బాదాడు.
రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఒంటి చేత్తో విహారి కొట్టిన ఓ రివర్స్ స్వీప్‌కు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇందులో భాగంగా రైట్ హ్యాండర్ అయిన విహారి..లెఫ్టాండ్ కు మారి షాట్ కొడతాడు. రివర్స్ స్వీప్ ను తలపించే ఈ షాట్ బౌండరీకి తరలివెళ్లింది. దీంతో ఈ షాట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన దినేశ్ కార్తీక్.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్ అంటూ కామెంట్ చేశాడు. ఇది బిన్నమైంది కాదని.. విభిన్నమైన షాట్ అని ప్రశంసించాడు.
విహారి ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన ఆంధ్ర ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 379 పరుగులకు ఆలౌట్ అయింది. మధ్యప్రదేశ్ 228 రన్స్ కొట్టింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లోఆంధ్ర కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. దీంతో 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 5 వికెట్లతో గెలిచింది.