రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20 టీమిండియా ఓడిపోయింది. 172 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 145 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ ఓడిపోవడానికి బ్యాటింగ్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆటగాళ్ల నిర్లక్ష్యపు షాట్ సెలక్షన్ ఓటమికి గురి చేసింది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ ను వాడుకోవడంలో భారత జట్టు యాజమాన్యం విఫలమైంది. అతన్ని తుది జట్టులోకి తీసుకున్నా.. అతన్ని ఒక ప్లేయర్ గా ఎవరూ పరిగణించలేదు.
ఈ మ్యాచ్ లో జురెల్ 8 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ గా జట్టులో స్థానం దక్కించుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కంటే ముందు సుందర్, అక్షర్ పటేల్ ముందుగా బ్యాటింగ్ కు రావడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన జురెల్ ను ఏదో టైలెండర్ గా చివర్లో పంపించారు. జురెల్ స్థానంలో వచ్చిన సుందర్, అక్షర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. బ్యాట్ ఝుళిపించడంలో విఫలమై భారత్ ఓడిపోవడానికి కారణమయ్యారు.
జురెల్ ను త్వరగా పంపి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అతను మ్యాచ్ విన్నర్ కాకపోయినా.. ఒత్తిడి సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడేవాడు. ఇక ఇదిలా ఉంటే టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.. జురెల్ ను తక్కువగా అంచనా వేశాడు. 18 ఓవర్ చివరి బంతికి సింగిల్ కు రావడానికి నిరాకరించాడు. ఇక్కడ కూడా జురెల్ కు అన్యాయం జరగగా.. పాండ్య చేసిన పనికి విమర్శలు వస్తున్నాయి.
🚨 WHAT A BLUNDER 🚨
— Vishal. (@SPORTYVISHAL) January 28, 2025
Sent Washington Sundar at No. 6, he scored 6 in 15 balls while chasing 172, whereas you were playing Dhruv Jurel as a pure batter and sent him at No. 8, when you had already lost the match. 🤦🏻♂️ pic.twitter.com/MqiBEUYivK