
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇండియా టూర్ ఖరారైంది. ఆగస్టులో జరిగే ఈ సిరీస్‌లో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. తొలి రెండు వన్డేలు, చివరి రెండు టీ20లకు మీర్పూర్ ఆతిథ్యమిస్తుండగా, మూడో వన్డే, తొలి టీ20 మ్యాచ్ చట్టోగ్రామ్‌లో జరగనున్నాయి. ఆగస్టు 13న ఢాకా చేరుకోనున్న టీమిండియా 17, 20, 23న మూడు వన్డేలు ఆడనుంది. 26, 29, 31న టీ20లు జరుగుతాయి. టీ20 ఆసియా కప్ నేపథ్యంలో ఈ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే 2014 తర్వాత బంగ్లాదేశ్‌లో ఇండియా ఆడనున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం.
విరాట్, బుమ్రా డౌటే..
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత ఈ టూర్ జరుగుతుండటంతో టీమిండియా సీనియర్లు ఇందులో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. సీనియర్లు విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా ఈ టూర్‌కు దూరంగా ఉండే చాన్స్ ఉంది. గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కూడా ఈ సిరీస్‌కు దూరం కావొచ్చు. ఎందుకంటే రెండు నెలల పాటు ఇంగ్లండ్‌లో పర్యటించిన తర్వాత వీళ్లకు రెస్ట్ ఇచ్చే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఇక రోహిత్ శర్మ ఆడటంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. టెస్టుల్లో ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న హిట్‌మ్యాన్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఎలా ఆడతాడన్నది అందరూ వేచి చూస్తున్న అంశం. ఒకవేళ అనివార్య కారణాలతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైతే బంగ్లాతో వన్డేల్లో ఆడే చాన్స్ ఉంది.