
జొహనెస్‌బర్గ్: నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా.. నవంబర్‌లో సౌతాఫ్రికాలో పర్యటించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డులు శుక్రవారం ప్రకటించాయి. నవంబర్ 8న డర్బన్‌లో జరిగే తొలి టీ20తో టూర్ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా నవంబర్10 (గెబెరా), 13 (సెంచూరియన్), 15 (జొహనెస్‌బర్గ్)వ తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి. ఇండియాలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ చిన్న టూర్‌ను ఏర్పాటు చేశామని బీసీసీఐ వెల్లడించింది. ఇక ఇండియాతో సిరీస్ తమకు ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుందని క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది.