జులైలో జింబాబ్వే టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీమిండియా

హరారే: టీమిండియా జులైలో జింబాబ్వే టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లనుంది. జులై ఆరు నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ద్వితీయ శ్రేణి ఇండియా జట్టు ఆతిథ్య జింబాబ్వేతో పోటీ పడనుంది. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు హరారే  స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా జులై 6, 7, 10, 13, 14వ తేదీల్లో షెడ్యూల్‌ చేసినట్టు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది. అమెరికా, వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 29న టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసిన వెంటనే ఈ సిరీస్ జరగనుంది. గతంలో మాదిరిగా టీమిండియా టాప్ ప్లేయర్లు ఈ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. 

ALSO READ:  ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మూడో వన్డేలోనూ విండీస్‌‌‌‌‌‌