వచ్చే ఏడాది అంటే.. 2025లో పాకిస్తాన్ దేశంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించటం లేదు టీమిండియా. ఈ విషయంపై టీమిండియా ఆటగాళ్లు సైతం ఇంట్రస్ట్ గా లేరనే వార్తలు వస్తున్నాయి. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు ఐసీసీ ఛాంపియన్ షిఫ్ పాకిస్తాన్ లో జరగనుంది. ఈ క్రమంలోనే ఇండియా పాకిస్తాన్ వెళుతుందా లేదా అనే సందేహాల మధ్య.. ఇప్పుడు ఈ వార్త లీక్ అయ్యింది.
ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు. 2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఉంటుందని.. మార్పు ఉండకపోవచ్చని వార్తలు వస్తు్న్నాయి. అయితే మరో ఏడు నెలల సమయం ఉండటంతో.. దౌత్యపరమైన చర్చల తర్వాత ఇండియా పాకిస్తాన్ వెళుతుందా లేదా అనేది వేచి చూడాలి.
2008లో చివరి సారిగా పాకిస్తాన్ దేశంలో టీమిండియా ఆసియా కప్ లో పాల్గొన్నది. ఆ తర్వాత నుంచి అంటే.. ఈ 14 ఏళ్లల్లో ఎప్పుడూ పాక్ వెళ్లలేదు టీమిండియా. తటస్త వేదికపై మాత్రం పాకిస్తాన్ తో తలపడుతుంది. రాబోయే 2025 ఐసీసీ చాంపియన్ షిప్ లో.. ఇండియా, పాక్ మ్యాచ్ పాకిస్తాన్ వేదికగా డిసైడ్ చేశారు. ఆ దేశంలోనే మ్యాచ్ లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీమిండియా.. పాకిస్తాన్ వెళ్లేందుకు ఆసక్తి చూపించటం లేదంట..
Also Read : కుర్రాళ్ల జోరు..మూడో టీ20లోనూ ఇండియా గెలుపు
దీనిపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ శుక్లా స్పందించారు. భారత ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్.. కేంద్రం అనుమతి ఇస్తే టీమిండియా జట్టును పంపిస్తాం అని సమాధానం ఇచ్చారు. ఐసీసీ ఛాంపియన్ షిప్ కు మరింత సమయం ఉండటంతో.. అప్పటి వరకు కేంద్ర నిర్ణయం, బీసీసీఐ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి..