రాజ్‌కోట్: వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఆడిన ఆఖరి వన్డేలో టీమిండియా బోల్తా కొట్టింది. టార్గెట్ ఛేజింగ్‌లో బ్యాటర్లు ఫెయిల్ కావడంతో.. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇండియా 66 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దీంతో ఆసీస్‌ను వైట్‌వాష్ చేయలేకపోయిన రోహిత్‌సేన సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ 50 ఓవర్లలో 352/7 స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ (96), స్మిత్ (74), లబుషేన్ (72), వార్నర్ (56) దంచికొట్టారు.
బుమ్రా 3 , కుల్దీప్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 49.4 ఓవర్లలో 286 రన్స్‌కు ఆలౌటైంది. రోహిత్ శర్మ (81) టాప్ స్కోరర్. కోహ్లీ (56), శ్రేయస్ అయ్యర్ (48), జడేజా (35), రాహుల్ (56) పోరాడి విఫలమయ్యారు. మ్యాక్స్‌వెల్ 4, హేజిల్‌వుడ్ 2 వికెట్లు తీశారు. మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, శుభ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.