ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంత్ రీఎంట్రి

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పంత్ రీఎంట్రి
  •     14 నెలల తర్వాత ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రీఎంట్రీ
  •     కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆడేందుకు బీసీసీఐ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     మెగా లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షమీ, ప్రసిధ్ దూరం

న్యూఢిల్లీ :  టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 14 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రానున్నాడు. ఈ నెల 22న మొదలయ్యే ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగి ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నడిపించనున్నాడు. పంత్  వికెట్ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆడేందుకు అవసరమైన ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాడని  బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. 2022 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30న  జరిగిన కారు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ 14 నెలల రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రికవరీ ప్రక్రియ తర్వాత  బెంగళూరు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏలో గంటల కొద్దీ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

ముఖ్యంగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ నిర్వహించిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిమ్యులేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుదీర్ఘ సమయాల పాటు కీపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. దాంతో కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా ఆడేందుకు అతనికి క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించింది. ఈ నేపథ్యంలో పంత్  టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు మెరుగయ్యాయి. మరోవైపు గాయాలకు  సర్జరీ చేయించుకొని కోలుకుంటున్న గుజరాత్ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక బౌలర్ షమీ, రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్ ప్రసిధ్ కృష్ణ  ఈ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యారని బీసీసీఐ తెలిపింది. షమీ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు కూడా అందుబాటులో ఉండబోడు.