బంగ్లాదేశ్ పర్యటనను భారత మహిళల జట్టు విజయవంతంగా ముగించింది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గురువారం(మే 09) ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 జరగ్గా.. హర్మన్ ప్రీత్ సేన 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట భారత మహిళలు 156 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లా మహిళలు 135 పరుగులకే పరిమితమయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు 156 పరుగులు చేసింది. స్మృతి మంధాన(33), హేమలత(37), హర్మన్‌ప్రీత్ కౌర్ (30), రిచా ఘోష్(28) పరుగులు చేశారు. టాపార్డర్ రాణించినా.. మిడిల్ ఆర్డర్ విఫలమయ్యారు. 15 ఓవర్లలోపే 122 పరుగులు చేసిన భారత జట్టు హర్మన్ ప్రీత్ వెనుదిరగ్గానే.. పరుగుల చేయడంతో వెనుకబడిపోయారు. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, నహిదా నటి రెండేసి వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 157 పరుగుల ఛేదనలో బంగ్లా బ్యాటర్లు తడబడ్డారు. రాధా యాదవ్, ఆశా శోభన చెలరేగడంతో బంగ్లా జట్టు 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో రీతూ మోని(37), షోరిఫా ఖాతున్(28) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 57 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది.
5-0 for INDIA 🇮🇳
— Female Cricket (@imfemalecricket) May 9, 2024
India clean sweeps the T20I series 5-0 against Bangladesh. #CricketTwitter #BANvIND pic.twitter.com/GWHBcyVphe