పాక్‎ను పడగొట్టి.. సెమీస్‎కు టీమిండియా

పాక్‎ను పడగొట్టి.. సెమీస్‎కు టీమిండియా
  • విరాట్​ కోహ్లీ సూపర్ సెంచరీ
  • పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియా ఘన విజయం
  • 6 వికెట్ల తేడాతో పాక్ చిత్తు
  • రెండో ఓటమితో టోర్నీ నుంచి ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

వన్డే, టీ20 వరల్డ్ కప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీమిండియాది తిరుగులేని రికార్డు. కానీ, చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇండియాపై పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే కాస్త పైచేయి. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాడితే మూడుసార్లు ఆ జట్టే గెలిచింది. అందునా 2017 ఎడిషన్ ఫైనల్లో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓటమి ఇండియాను చాలా కాలం పాటు వెంటాడింది..!  ఎనిమిదేండ్ల  విరామం తర్వాత తిరిగి మొదలైన ఈ మెగా ట్రోఫీలో టీమిండియా లెక్క సరిచేసింది. 

తన ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సామర్థ్యంపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. రికార్డుల రారాజు, ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ (111 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లతో 100 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అద్భుత, అజేయ సెంచరీతో విజృంభించిన వేళ.. దుబాయ్ గడ్డపై దాయాదిని చిత్తుగా ఓడించింది. గత ఫైనల్ ఓటమికి ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రివెంజ్ తీర్చుకుంటూ దర్జాగా సెమీఫైనల్లో అడుగు పెట్టింది.
 
మనం ట్రోఫీ నెగ్గడమే కాదు.. టీమిండియాపైనా గెలవాల్సిందేనని టోర్నీకి ముందు సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి వచ్చి సూచించినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాయాదిపై విజయం సాధించాలంటూ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు దేశ క్రికెట్ బోర్డు చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతీ ఆటగాడితో మాట్లాడి స్ఫూర్తి  నింపినా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తేలిపోయింది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఘోరంగా విఫలమైంది. మూడు దశాబ్దాల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆతిథ్యం ఇస్తున్న పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మన జట్టు కొట్టిన దెబ్బతో మెగా టోర్నీ మొదలైన వారం రోజుల్లోనే ఇంటిదారి పట్టే ప్రమాదంలో నిలిచింది. 

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఐసీసీ టోర్నమెంట్లలో దాయాది పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో విజృంభించడంతో చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. వరుసగా రెండో విజయంతో దర్జాగా సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఓడిన పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెగా టోర్నీ నుంచి దాదాపు వైదొలిగింది. ఏకపక్ష పోరులో టాస్ నెగ్గిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

సౌద్ షకీల్ (76 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 62), మహ్మద్ రిజ్వాన్ (77 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లతో 46), ఖుష్దిల్ షా (39 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 సిక్సర్లతో 38) రాణించారు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు, హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (67 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో  56) మెరుపులతో ఇండియా 42.3 ఓవర్లలోనే 244/4 స్కోరు చేసి గెలిచింది. 

కోహ్లీ, అయ్యర్​ మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 114 రన్స్ జోడించారు. శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (52 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లతో 46) కూడా రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మార్చి 2న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా పోటీ పడుతుంది. గురువారం జరిగే తమ చివరి మ్యాచ్‌‌లో బంగ్లాతో పాక్‌‌ తలపడనుంది. ఇందులో నెగ్గినా ఆతిథ్య జట్టు సెమీస్ చేరడం కష్టమే.  

కోహ్లీ, అయ్యర్ కొట్టేశారు..

ఛేజ్ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్ కోహ్లీ ముందుండి నడిపించడంతో చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా సులువుగా అందుకుంది. కెప్టెన్ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (20) ఉన్నంతసేపు భారీ షాట్లతో అలరించాడు. నసీమ్ షా వేసిన రెండో ఓవర్లోనే 4, 6 కొట్టడంతో స్టేడియం హోరెత్తింది. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. షాహీన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లతో టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. ఐదో ఓవర్లో అద్భుతమైన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వింగింగ్ యార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బౌల్డ్ చేసిన షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలి బ్రేక్ అందించాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన విరాట్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. 

షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన గిల్ క్లాసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్లతో వరుస బౌండ్రీలు కొట్టడంతో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలో ఇండియా 64/1తో నిలిచింది. రవూఫ్ ఓవర్లో తన ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ జోరు పెంచాడు. 35 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఖుష్దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా క్యాచ్ డ్రాప్ చేయడంతో లైఫ్ దక్కించుకున్న గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్ స్కోరు 100 దాటగానే  18వ ఓవర్లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్రార్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బౌల్డ్ అవ్వడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 69 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. 

ఈ దశలో కోహ్లీకి శ్రేయస్ అయ్యర్ తోడయ్యాడు. మిడిల్ ఓవర్లలో పాక్ స్పిన్నర్లలో బౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పరీక్ష పెట్టడంతో ఈ ఇద్దరూ ఒక్కో పరుగు జోడించారు. శ్రేయస్  జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో నసీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టి కోహ్లీ ఫిఫ్టీ (62 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో) పూర్తి చేసుకున్నాడు. తొలి 34 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17 రన్సే చేసిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఖుష్దిల్ వేసిన 28వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో స్పీడు పెంచాడు. అదే ఓవర్లో తన క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను షకీల్ డ్రాప్ చేశాడు.

దీన్ని సద్వినియోగం చేసుకున్న అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సల్మాన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా భారీ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. ఇదే జోరును కొనసాగిస్తూ 63 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. 37 ఓవర్లలో స్కోరు 200 దాటింది. విజయం ముంగిట వరుస ఓవర్లలో అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు హార్దిక్ (8) ఔటవగా.. కోహ్లీ సెంచరీ చేస్తాడో లేదో అని టెన్షన్ రేగింది. ఖుష్దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టిన విరాట్ సెంచరీ అందుకోవడంతో పాటు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించాడు. 

ఆదుకున్న షకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  

క్లిష్టమైన వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కీలకమైన టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీ స్కోరు చేయకుండా ఇండియా బౌలర్లు నిలువరించారు. ముఖ్యంగా ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేశారు. సౌద్ షకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కీలకమైన 104 రన్స్ జోడించడంతో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ మాత్రం స్కోరైనా చేసింది. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్ షమీ  తొలి ఓవర్లోనే ఐదు వైడు సహా 11 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసి ఆశ్చర్యపరిచాడు. షమీతో పాటు రాణా ఎక్కువగా ఫుల్లర్ బాల్స్ వేయగా... పాక్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబర్ ఆజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (23)  స్వేచ్ఛగా డ్రైవ్ చేస్తూ బౌండ్రీలు రాబట్టాడు.  

దాంతో కెప్టెన్ రోహిత్ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హార్దిక్ పాండ్యాను బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దింపాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 41 రన్స్ జోడించిన బాబర్‌‌‌‌‌‌‌‌ను కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఔట్ చేయడంతో ఇండియాకు ఫస్ట్ బ్రేక్ లభించింది. తర్వాతి ఓవర్లో లేని పరుగు కోసం ప్రయత్నించిన మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (10)ను అక్షర్ రనౌట్ చేయడంతో పవర్ ప్లేలో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 52/2తో నిలిచింది. ఇక్కడి నుంచి ఇండియా బౌలర్లు ఒత్తిడి పెంచడంతో సౌద్ షకీల్, రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాతి 15 ఓవర్ల 47 రన్స్ మాత్రమే చేశారు. ఓ దశలో 55 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు.  క్రీజులో కుదురుకున్న తర్వాత షకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిజ్వాన్ నెమ్మదిగా గేరు మార్చారు.

జడేజా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వీప్ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రిజ్వాన్ ఫోర్ కొట్టగా.. కుల్దీప్ ఓవర్లో షకీల్ రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బౌండ్రీ రాబట్టి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చలనం తెచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య  సెంచరీ భాగస్వామ్యం నమోదవగా... షకీల్ 63 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే, జోరు పెంచాల్సిన సమయంలో ఈ ఇద్దరూ వెంటవెంటనే ఔటవడం పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసింది. రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అక్షర్,  షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హార్దిక్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే తయ్యబ్ తాహిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4) జడ్డూ బౌల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరో దెబ్బకొట్టాడు.

 దాంతో 151/2తో పటిష్ట స్థితిలో కనిపించిన పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14 రన్స్ తేడాలో 3 వికెట్లు కోల్పోయి 165/5తో డీలా పడింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ బ్యాటర్ ఖుష్దిల్ షా స్లాగ్ ఓవర్లలో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. సల్మాన్ అఘా (19)తో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కీలకమైన 35 రన్స్ జోడించి స్కోరు 200 దాటించాడు. 43వ ఓవర్లో వరుసగా బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అఘాతో పాటు షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా (0)ను ఔట్ చేసి పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డబుల్ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. నసీమ్ షా (14)ను కూడా పెవిలియన్ చేర్చినా.. చివర్లో ఖుష్దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా మెరుపులు మెరిపించాడు. షమీ వేసిన 49వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి రాణా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఖరి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఔటయ్యాడు.

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్‌

వన్డేల్లో విరాట్14 వేల రన్స్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాడు. పాక్ బౌలర్ రవూఫ్ వేసిన 13వ ఓవర్లో ఫోర్ కొట్టి ఈ మార్కు దాటాడు. 287వ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనే ఈ ఘనత సాధించి వేగంగా 14 వేల రన్స్ చేసిన క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సచిన్ (359 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 350 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు)  రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక రన్స్ జాబితాలో కోహ్లీది మూడో స్థానం. సచిన్ (18,426), సంగక్కర (14,234) ముందున్నారు.

  • 51 వన్డేల్లో విరాట్ కోహ్లీ సెంచరీలు. మూడు ఫార్మాట్లలో కలిపి ఇది 82వ వంద.
  • 11 తొలి ఓవర్లో షమీ వేసిన బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ టోర్నీలో ఒక ఓవర్లో ఎక్కువ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన ఇండియా బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. 2017 ఫైనల్లో బుమ్రా ఓ ఓవర్లో 9 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశాడు. ఈ టోర్నీలో తొలి ఓవర్లో అత్యధికంగా ఐదు వైడ్ బాల్స్ వేసిన బౌలర్ షమీనే కావడం గమనార్హం.
  • 158 వన్డేల్లో విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు. ఇండియా తరఫున అత్యధిక క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందుకున్న ఫీల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మహ్మద్ అజరుద్దీన్ (156) రికార్డు బ్రేక్ చేశాడు.
  • 11 ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు ఫార్మాట్లలో కలిపి హార్దిక్ పాండ్యా 200 వికెట్ల క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాడు.
  • 300 ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుల్దీప్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 300 వికెట్ల మైలురాయి దాటాడు.
  • 5/8 వన్డేల్లో పాక్ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాహీన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోహిత్ 8 ఇన్నింగ్స్‌‌‌‌లో ఐదోసారి ఔటయ్యాడు.. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 0/12 వన్డేల్లో ఇండియా టాస్ కోల్పోవడం ఇది వరుసగా 12వ సారి. 2023 వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇండియా కెప్టెన్ ఒక్కసారి కూడా టాస్ నెగ్గలేదు. ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాస్ కోల్పోయిన జట్టుగా.. నెదర్లాండ్స్ (11సార్లు) రికార్డును ఇండియా బ్రేక్ చేసింది. 

స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇమామ్- ఉల్-హక్ (రనౌట్ /అక్షర్) 10, బాబర్  (సి) రాహుల్ (బి) పాండ్యా 23, సౌద్ షకీల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 62,రిజ్వాన్ (బి) అక్షర్ 46, సల్మాన్ అఘా (సి) జడేజా (బి) కుల్దీప్ 19,తయ్యబ్ తాహిర్ (బి) జడేజా 4, ఖుష్దిల్  (సి) కోహ్లీ (బి) రాణా 38, షాహీన్ షా (ఎల్బీ) కుల్దీప్ 0;  నసీమ్ షా (సి) కోహ్లీ (బి) కుల్దీప్ 14, రవూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (రనౌట్) 8, అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాలు: 17;  మొత్తం: 49.4 ఓవర్లలో 241 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌; వికెట్ల పతనం: 1-–41, 2–-47, 3-–151, 4–-159, 5-–165, 6-–200, 7-–200, 8–-222, 9–-241, 10–-241; బౌలింగ్: మహ్మద్ షమీ 8-–0–-43–-0, హర్షిత్ రాణా 7.4–-0–30–1, హార్దిక్ పాండ్యా 8–0–31–-2, అక్షర్ పటేల్ 10–-0–-49–1, కుల్దీప్ 9–-0-–40–-3, జడేజా 7–-0-–40-–1
ఇండియా:  రోహిత్ (బి) షాహీన్ షా 20, గిల్ (బి) అబ్రార్ 46, కోహ్లీ (నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 100 , శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సి) ఇమామ్ (బి) ఖుష్దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 56, పాండ్యా (సి) రిజ్వాన్ (బి) షాహీన్ షా 8, అక్షర్ (నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 3; ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాలు: 11; మొత్తం: 42.3  ఓవర్లలో 244/4;  వికెట్ల పతనం: 1–-31, 2–100, 3–214, 4–223; బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా 8–0–74–2, నసీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8–0–37–0, రవూఫ్  7–0–52–0, అబ్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10–0–28–1, ఖుష్దిల్ 7.3–0–43–1, సల్మాన్ అఘా 2–0–10–0.

తారలు దిగివచ్చిన వేళ..

ఇండియా–పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అభిమానులు పోటెత్తారు. దాంతో దుబాయ్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది.  వీరిలో మెజారిటీ వంతు ఇండియా అభిమానులే ఉన్నారు. ఈ పోరుకు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. ఐసీసీ చైర్మన్ జై షా, కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ క్రికెటర్లు ఆఫ్రిది, బ్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీ, ఇండియా క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తదితరులు స్టాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూర్చొని మ్యాచ్ చూశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఐఏఎస్ అధికారి జయేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుకుమార్ తదితరులు స్టేడియంలో సందడి చేశారు. మరోవైపు లెజెండరీ క్రికెటర్ ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధోనీ ముంబైలో ఓ స్టూడియోలో  ఈ మ్యాచ్ ను స్పెషల్ స్ర్కీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూశాడు. 

కీలకమైన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం సంతోషాన్నిచ్చింది. రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటైన తర్వాత నా పని స్పష్టంగా అర్థమైంది. మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్లను నియంత్రించాలి. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పిన్నర్లపై రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోకుండా పేసర్లను దీటుగా ఆడాలి. వన్డేల్లో ఎలా ఆడాలన్న దానిపై నాకు మంచి అవగాహన ఉంది. నా శక్తిని, ఆలోచనను జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్లా. గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా ఆడారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మంచిగా కదిలారు. రాబోయే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఇది కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తుంది.  

 

మరిన్ని వార్తలు