యువీ, సచిన్ ధనాధన్‌‌‌‌.. మాస్టర్స్ లీగ్‎లో ఆసీస్‎పై టీమిండియా ఘన విజయం

యువీ, సచిన్ ధనాధన్‌‌‌‌.. మాస్టర్స్ లీగ్‎లో ఆసీస్‎పై టీమిండియా ఘన విజయం

రాయ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నమెంట్‌‌‌‌లో ఇండియా లెజెండరీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ (30 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 7 సిక్సర్లతో 59), సచిన్ టెండూల్కర్ (30 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లతో 42) తమ క్లాస్ చూపెట్టారు. ఈ ఇద్దరి మెరుపులతో ఇండియా మాస్టర్స్‌‌‌‌ ఫైనల్ చేరుకుంది. గురువారం జరిగిన సెమీస్‌‌‌‌లో 94 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా మాస్టర్స్‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 220/7 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ 126 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. బెన్ కటింగ్ (39) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌ కాగా,  షాబాజ్ నదీమ్‌‌‌‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.