ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. మరోవైపు గాయంతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ ను జట్టు నుంచి తప్పించారు. మూడో టెస్టుకు రెస్ట్ తీసుకుంటాడనుకున్న పేస్ బౌలర్ బుమ్రాను ఎంపిక చేశారు.
ఫిట్ నెస్ సాధించకపోయినా రాహుల్, జడేజాలను ఎంపిక చేశారు. వీరిద్దరూ మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఇదిలా ఉండగా కొత్త బౌలర్ ఆకాష్ దీప్ కు స్క్వాడ్ లో చోటు దక్కింది. రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ఫిబ్రవరి 15న ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చివరి రెండు టెస్టులు రాంచీ (ఫిబ్రవరి 23), ధర్మశాల (మార్చి 7)లో జరుగుతాయి.
5 టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత వైజాగ్ లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ దుబాయ్ లో ఉంది. ఫిబ్రవరి 13 న రాజ్ కోట్ కు చేరుకుంటుంది.
ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్
??? India has announced their squad for the remainder of the Test series against England. ⬇️
— KG Sports (@TheKGSports) February 10, 2024
- Virat Kohli unavailable for selection due to personal reasons.
- Shreyas Iyer ruled out.
- KL Rahul and Ravindra Jadeja's availability is subject to fitness.#INDvsENG #TeamIndia pic.twitter.com/qqU5HjxqPP