కోహ్లీకి గాయం.. రెండో వన్డేలో ఆడతాడా ?

కోహ్లీకి గాయం.. రెండో వన్డేలో ఆడతాడా ?

నాగ్‌పూర్‌: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి వన్డేకు దూరమయ్యాడు. విరాట్ కుడి మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రస్తుతానికి గాయం తీవ్రత గురించి క్లారిటీ లేదు. ఒకవేళ గాయం పెద్దదైతే జట్టుకు ఎదురుదెబ్బ కానుంది.ఈ సిరీస్ తర్వాత ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది. 

ఇప్పటికే వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న  స్టార్ పేసర్ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీపై క్లారిటీ లేదు.  ఇప్పుడు కోహ్లీ కూడా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. మోకాలి నొప్పి కారణంగానే అతను బుధవారం నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేదని తెలుస్తోంది. స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన తర్వాతే అతని గాయంపై  స్పష్టత రానుంది. అయితే, కోహ్లీ గాయం పెద్దది కాదని రెండో వన్డేలో అతను పాల్గొంటాడని శుభ్‌మన్ గిల్ చెప్పాడు.