చాంపియన్​షిప్​ విన్నింగ్​ జోష్

చాంపియన్​షిప్​  విన్నింగ్​ జోష్

సిటీలో ఆదివారం చాంపియన్​షిప్​  విన్నింగ్​ జోష్​ కనిపించింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ ​లో టీమిండియా ఘన విజయం సాధించడంతో ఫ్యాన్స్​ సంబురాలు చేసుకున్నారు. యువత వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి విజయోత్సవాలు చేసుకోవడంతో అర్ధరాత్రి అయినా చోట్ల ట్రాఫిక్​ జామయ్యింది. 

అంతకుముందు మధ్యాహ్నం మ్యాచ్ చూసేందుకు మెయిన్​ సెంటర్లలో  బిగ్​ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. థియేటర్లలో స్పెషల్​ స్క్రీనింగ్​ వేయగా  ఫ్యాన్స్​ క్యూ కట్టారు.  ఫాంహౌస్​లు, రిసార్టుల్లో కూడా మ్యాచ్​ చూస్తూ చిల్​ అయ్యారు. ఇండ్లల్లో అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు.   - వెలుగు నెట్​వర్క్​