
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ఏరియాలోని బొగ్గు గనులను నేషనల్ కోల్ కంట్రోల్ఉన్నతాధికారుల బృందం బుధవారం సందర్శించింది. నాగ్‌పూర్ రీజియన్ నేషనల్ కోల్ కంట్రోల్(మహారాష్ట్ర) ఓఎస్డీ సందీప్పరాంజపే, కొత్తగూడెం రీజియన్ ఓఎస్డీ డీవీ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు ఏరియాలో మూసివేసిన ఆర్కే-8 గనిని పరిశీలించారు. గని మొయిన్ వే, ఎయిర్ షాప్ట్ పరిసరాలు, సేఫ్టీ ఫెన్సింగ్‌ను తనిఖీ చేశారు.
పర్యావరణ, భూసారం పరిరక్షణకు చేపట్టిన చర్యలు, నీటి నిర్వహణ తీరును శ్రీరాంపూర్ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్‌ను అడిగితెలుసుకున్నారు. ఏరియా ఏస్వోటుజీఎం సత్యనారాయణ, ఆర్కే7 గ్రూప్ఏజెంట్రాజేందర్, కార్పొరేట్ఆఫీసర్లు తిరుపతి, జి.బాబ్జి, ఎం.శేఖర్, ఆర్కే7 మైన్ మేనేజర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు