
సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘పేషన్’. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్‌లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ షూట్ చేశారు. తాజాగా రెండో షెడ్యూల్‌కు మూవీ టీమ్ రెడీ అవుతోంది. ప్రేమ, ఆకర్షణకి సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి ఈ సినిమా సమాధానం అవుతుందని దర్శకుడు అరవింద్ అన్నాడు.