టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐసీసీ మెగా టోర్నీలో భారత్కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్ గా ఈ ఘనత సాధించాడు. జార్ఖండ్ డైనమైట్, మాజీ లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని 40 విజయాలతో మొదటి స్థానంలో ఉన్నాడు. అంతకు ముందు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 16 విజయాలతో రెండో ప్లేసులో ఉన్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్ 2024 లో భాగంగా యూఎస్ఏ(USA)తో జరిగిన మ్యాచ్లో భారత్ గెలవడంతో రోహిత్ 17 విజయాలు అందుకున్నాడు.
ఐసీసీ మెగా టోర్నీలో భారత్ కు 58 మ్యాచ్ లో 40 విజయాలు అందించాడు ఎంఎస్ ధోని. ఇంతకుముందు సౌరవ్ గంగూళీ 22 మ్యాచ్ల్లో 16 విజయాలు ఇండియాకు అందించాడు. USA జరిగిన మ్యాచ్లో ఈ ఘనత రోహిత్ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, జూన్ 13న(నిన్న) నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఎస్ఏపై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయంలో అర్షదీప్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే కీలక పాత్ర పోషించారు. భారత్ హ్యాట్రిక్ విజయం సాధించి..సూపర్ 8లోకి అడుగు పెట్టింది.