క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డీకే గుడ్‌‌‌‌బై

క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డీకే గుడ్‌‌‌‌బై

చెన్నై: టీమిండియా మాజీ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డీకే) అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగానే కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెబుతున్నట్లు ప్రకటించినా.. తన 39వ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేను పురస్కరించుకుని శనివారం అధికారికంగా వెల్లడించాడు. ‘కొంత కాలం నుంచి రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఆలోచిస్తున్నా. ఎట్టకేలకు సమయం వచ్చేసింది. పోటీ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. 

అందుకే ఈ రోజు అధికారికంగా నా రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటిస్తున్నా. రాబోయే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3463 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఒక సెంచరీ, 17 హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీలు సాధించాడు. కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 172 ఔట్లలో భాగం పంచుకున్నాడు.