టీ20 వరల్డ్ కప్ లో ఇండియా బోణి..ఐర్లాండ్ పై గ్రాండ్ విక్టరీ

టీ20 వరల్డ్ కప్ లో ఇండియా బోణి..ఐర్లాండ్ పై గ్రాండ్ విక్టరీ
  • టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో శుభారంభం
  • మెరిసిన రోహిత్‌‌‌‌‌‌‌‌, పాండ్యా, బుమ్రా

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఇండియా టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ను సూపర్ విక్టరీతో షురూ చేసింది. హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా (3/27), బుమ్రా (2/6), అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (2/35) సూపర్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు తోడు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ (37 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 52) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎ లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ 16 ఓవర్లలో 96 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. గారెత్‌‌‌‌‌‌‌‌ డిలానీ (14 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 26) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 12.2  ఓవర్లలో 97/2 స్కోరు చేసి నెగ్గింది. కోహ్లీ (1), సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ (2) ఫెయిలైనా రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 36 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రాణించాడు. బుమ్రాకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

బౌలర్లు సూపర్‌‌‌‌‌‌‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ను ఇండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో ఐర్లాండ్ టీమ్‌‌‌‌లో నలుగురు మాత్రమే డబుల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌ స్కోరు అందుకున్నారు. మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌.. ఓపెనర్లు పాల్‌‌‌‌‌‌‌‌ స్టిర్లింగ్‌‌‌‌‌‌‌‌ (2), బాల్‌‌‌‌‌‌‌‌బిర్నీ (5)ని ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బౌలర్లు కంటిన్యూ చేశారు. పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో 26/2 స్కోరు చేసిన ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌కు హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా డబుల్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 7, 9వ ఓవర్లలో వరుసగా లోర్కాన్‌‌‌‌‌‌‌‌ టకర్‌‌‌‌‌‌‌‌ (10), కర్టిస్‌‌‌‌‌‌‌‌ క్యాంఫర్‌‌‌‌‌‌‌‌ (12)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. మధ్యలో హ్యారీ టెక్టర్‌‌‌‌‌‌‌‌ (4)ను బుమ్రా ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ 44/5తో కష్టాల్లో పడింది. 

ఈ దశలో డిలానీ కాసేపు అడ్డుకున్నా.. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బౌలర్లు పెద్దగా చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. వరుస ఓవర్లలో వికెట్లు తీశారు.10వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ (1/13) దెబ్బకు జార్జ్‌‌‌‌‌‌‌‌ డాక్రెల్‌‌‌‌‌‌‌‌ (3) ఔట్‌‌‌‌‌‌‌‌ కాగా, తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో పాండే.. మార్క్‌‌‌‌‌‌‌‌ అడైర్‌‌‌‌‌‌‌‌ (3)కి షాకిచ్చాడు. అప్పటికే ఒత్తిడి పెరగడంతో బారీ మెకార్తీ (0),  జోష్‌‌‌‌‌‌‌‌ లిటిల్‌‌‌‌‌‌‌‌ (14) కూడా బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. బుమ్రా దెబ్బకు లిటిల్‌‌‌‌‌‌‌‌ ఔటవగా, చివర్లో డిలానీ గా రనౌట్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది. 

ఓపెనర్ కోహ్లీ ఫెయిల్.. రో‘హిట్‌‌‌‌‌‌‌‌’..

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కోహ్లీ ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా వచ్చి ఫెయిలయ్యాడు. అడైర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో స్వీప్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ కొట్టి క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌గా వెనుదిరిగాడు. కానీ రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌‌‌‌‌తో జోరు చూపెట్టాడు. పంత్‌‌‌‌‌‌‌‌  ఫోర్‌‌‌‌‌‌‌‌తో ఖాతా తెరవగా, ఇండియా 39/1తో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేను ముగించింది. 

తర్వాత పంత్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్లినా రోహిత్‌‌‌‌‌‌‌‌ మాత్రం చాన్స్‌‌‌‌‌‌‌‌ దొరికినప్పుడల్లా బౌండ్రీలు బాదాడు. 9వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో వరుస సిక్సర్లు, ఆ వెంటనే ఫోర్‌‌‌‌‌‌‌‌తో 36 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 76/1 స్కోరు చేసింది. ముందు ఓవర్లో బంతి తగిలి కుడి భుజంలో నొప్పి రావడంతో  రోహిత్‌‌‌‌‌‌‌‌ రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ హర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. దాంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 54 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. సూర్యకుమార్  నిరాశ పరిచినా.. విజయానికి కావాల్సిన 6 రన్స్‌‌‌‌‌‌‌‌ను పంత్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌తో అందించాడు.