‘తంగలాన్’ తర్వాత విక్రమ్ నుంచి రాబోతున్న చిత్రం ‘వీర ధీర శూరన్’. ‘చిన్నా’ ఫేమ్ ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకుడు. రియా శిబు నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ సెకండ్ పార్ట్‌ను ముందుగా విడుదల చేయబోతున్నారు. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. కిరాణా షాపులో కూతురుని నిద్ర పుచ్చుతున్న విక్రమ్.. సరుకుల కోసం వచ్చిన మహిళను కాస్త మెల్లిగా మాట్లాడమని సైగ చేస్తున్నాడు.
దుషార విజయన్ తనకు భార్యగా నటించింది. ఫ్యామిలీతో సరదాగా ఉన్న హీరో పాత్రలో మరో కోణాన్ని కూడా చూపించారు. కత్తులు, గన్స్, బాంబులతో అతను విధ్వంసం సృష్టిస్తాడు. పోలీస్ ఆఫీసర్‌గా ఎస్.జె.సూర్య, మరో పవర్‌ఫుల్ రోల్‌లో మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కనిపించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది.