సింహాసనం కోసం .. భూల్ భూలైయా 3 నుంచి టీజర్ రిలీజ్

సింహాసనం కోసం .. భూల్ భూలైయా 3 నుంచి టీజర్ రిలీజ్

కార్తిక్ ఆర్యన్‌‌‌‌ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘భూల్ భూలైయా 3’.  బాలీవుడ్ సూపర్ హిట్‌‌‌‌ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  అనీశ్ బజ్మీ దర్శకుడు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. కుర్చీని పైకి ఎత్తుతూ..  ఇది నా సింహాసనం,  దాని జోలికి ఎవరూ రాకూడదు,  ఎన్నిసార్లు నా నుంచి దాన్ని లాక్కుంటావ్ అని విద్యాబాలన్‌‌‌‌ కోపంతో ఊగిపోవడం చూస్తుంటే సింహాసనం కోసం జరిగే పోటీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అర్థమవుతోంది. 

దెయ్యాలకు భయపడే వాళ్లు మూర్ఖులు అని చెప్పిన కార్తిక్ ఆర్యన్.. నెక్స్ట్‌‌‌‌ సీన్‌‌‌‌లో దెయ్యాన్ని చూసి భయపడటం నవ్వించింది. మొత్తానికి గత రెండు చిత్రాల తరహాలో భయపెడుతూ కామెడీ పంచబోతోందని టీజర్‌‌‌‌‌‌‌‌ ద్వారా అర్థమవుతోంది. అలాగే కార్తిక్,  త్రిప్తి డిమ్రి మధ్య లవ్ ట్రాక్‌‌‌‌ ఇంప్రెస్ చేసింది.  ఫస్ట్ పార్ట్‌‌‌‌లో నటించిన విద్యాబాలన్‌‌‌‌.. మంజులిక పాత్రతో రీఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు పెరిగాయి.  దీపావళికి సినిమా విడుదల కానుంది.