NBK 109: నందమూరి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. NBK 109 నుండి స్టన్నింగ్ అప్డేట్

NBK 109: నందమూరి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. NBK 109 నుండి స్టన్నింగ్ అప్డేట్

నందమూరి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మూవీ NBK 109. వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీ కొల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన NBK 109 టీజర్ కు ఆడియన్స్ నుండి, మరీ ముఖ్యంగా నందమూరి అభిమానుల నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచేసింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా నుండి మరో గ్లింప్స్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున ఈ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారట. ఇదే విషయాన్నీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇటీవల.. ఆయన తన సోషల్ మీడియాలో  ఫైరింగ్ అప్డేట్ అంటూ రాసుకొచ్చారు. దాంతో ఇది ఖచ్చితంగా NBK 109 గురించే అనే టాక్ నడుస్తోంది. దీంతో బాలకృష్ణ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా నుండి వస్తున్న ఈ అప్డేట్ ఏ రేంజ్ లో ఉండనుందో చూడాలి.