కొత్త ఏడాదిలో కొత్త ఫీచర్లు, అప్డేట్స్తో యూజర్ల మనసు దోచేందుకు రెడీ అవుతున్నాయి టెక్ కంపెనీలు. అంతేకాదు కస్టమర్ల ప్రైవసీ, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్లు తెస్తున్నాయి. ఐఫోన్ నుంచి టెలిగ్రామ్ యాప్ వరకు యూజర్లు మెచ్చే ఫీచర్లు అందిస్తున్నాయి. అలాంటి కొన్ని ఫీచర్ల గురించి...
ఐఫోన్ నుంచి పీసీలోకి..
స్మార్ట్‌ఫోన్ చూస్తున్నప్పడు ఇంట్రెస్టింగ్ లింక్స్ కనిపిస్తుంటాయి. వాటిని ఫోన్లో ఓపెన్ చేసి, చదవడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఫోన్ నుంచి ఆ లింక్స్, టెక్స్ట్‌ని సిస్టమ్‌లో కాపీ చేసే ఫీచర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. యాపిల్ కంపెనీ ఐఫోన్, మ్యాక్‌బుక్ యూజర్ల కోసం కొత్తగా తెచ్చిన ‘హ్యాండ్ ఆఫ్’ ఫీచర్ అలాంటిదే. ఈ ఫీచర్ ఉంటే ఐఫోన్, మ్యాక్ లేదా మ్యాక్ బుక్‌లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈజీగా ఐఫోన్లో కాపీ చేసిన టెక్స్ట్, ఫొటోలు, లింక్ అడ్రస్లని మాక్‌బుక్‌లో పేస్ట్ చేయొచ్చు. మాక్‌బుక్ నుంచి ఫోన్లోకి కాపీ చేయొచ్చు కూడా. అదెలాగంటే...
మ్యాక్‌లో యాపిల్ మెనూలో, సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి వెళ్లాలి. తర్వాత జనరల్ సెట్టింగ్‌లోకి వెళ్లి, ‘అలౌ హ్యాండ్ఆఫ్’ పై క్లిక్ చేయాలి. ఐ ఫోన్లో జనరల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘హ్యాండ్ ఆఫ్’ ఓపెన్ చేయాలి. యాపిల్ వాచ్ వాడేవాళ్లు ఐఫోన్లో యాపిల్ వాచ్ యాప్‌లోకి వెళ్లి హ్యాండ్ ఆఫ్ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. హ్యాండ్ ఆఫ్ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉంటే... ఇవన్నీ చేయొచ్చు. అయితే ఈ ఫీచర్ పనిచేయాలంటే ఐఫోన్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్.. అన్నీ ‘ఐ క్లౌడ్’ అకౌంట్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇంటర్నెట్ కూడా ఉండాలి.