హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ - సీ1 (గతంలో కన్వర్జ్‌వన్) హైదరాబాద్‌లో సోమవారం తన గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ కెపాబిలిటీస్ సెంటర్ (జీఐసీసీ)ను ప్రారంభించింది. అమెరికా, కెనడాలోని తమ క్లయింట్లకు సేవలను అందించడానికి దీనిని అందుబాటులోకి తెచ్చింది.రాయదుర్గ్‌లోని సత్వ నాలెడ్జ్ పార్క్‌లో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసినట్టు తెలిపింది
అత్యాధునిక శిక్షణా సౌకర్యాలతో ఈ సెంటర్లో సీటింగ్ సామర్థ్యాన్ని కూడా రెట్టింపు చేశామని పేర్కొంది. ఇక్కడే ఆర్అండ్డీ, ఎక్స్పీరియెన్స్సెంటర్ ఉంటాయి. ఇండియాలో తమకు నాలుగు వేల మంది ఉద్యోగులు ఉన్నారని సీ1 ఎండీ చంద్ర బొడ్డోజు అన్నారు.