Google Layoffs: వందల ఉద్యోగులకు గూగుల్ షాక్.. ఆండ్రాయిడ్, పిక్సెల్ టెక్కీల ఊస్టింగ్

Google Layoffs: వందల ఉద్యోగులకు గూగుల్ షాక్.. ఆండ్రాయిడ్, పిక్సెల్ టెక్కీల ఊస్టింగ్

Tech Layoffs: ప్రస్తుతం అమెరికా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉన్నాయి. ఈ క్రమంలో గూగుల్ సంస్థ వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించటానికి సిద్ధమైంది. ఈసారి గూగుల్ క్రోమ్ బ్రౌజర్, పిక్సెస్ ఫోన్స్, ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ విభాగాల్లో ఉద్యోగులు ప్రభావితం అవుతున్నారని వెల్లడైంది. కంపెనీలో పరిస్థితులపై తెలిసిన వ్యక్తులు చెప్పిన విషయాలతో లేఆఫ్స్ గురించి బయటకు పొక్కింది. 

వాస్తవానికి గూగుల్ సంస్థ ఈ ఏడాది జనవరి చివరిలోనే వందల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డివైజెస్, ఫ్లాట్ ఫారమ్స్ విభాగంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛందంగా కంపెనీని వీడేందుకు ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు వెల్లడైంది. ఆ సమయంలో ఎంత మంది ఉద్యోగులను గూగుల్ తొలగించనుందనే విషయాలు బయటకు రానప్పటికీ ప్రస్తుతం దాని ప్రభావం కనిపిస్తోంది. 

ఆ సమయంలో కంపెనీ కేవలం ఆండ్రాయిడ్, క్రోమ్, పిక్సెల్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఈ ఆఫర్ అందించింది. అలాగే ఏఐ, గూగుల్ సెర్చ్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం గుగుల్ కంపెనీలో సేఫ్ గా ఉన్నట్లు తేలింది. 

గూగుల్ స్వచ్ఛందంగా ఉద్యోగులకు విరమణ అవకాశాన్ని కల్పించటం ద్వారా వందలాది మందిని తొలగించడం కొంత సరైన మార్గంలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. అంతిమంగా కంపెనీ టార్గెట్ తన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టీమ్స్ సైజ్ తగ్గించటమేనని తెలుస్తోంది. తక్కువ మందితో ఎక్కువ పనిచేయించటం ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రస్తుతం గూగుల్ చూస్తోందని తాజా లేఆఫ్స్ ద్వారా తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రంప్ టారిఫ్స్ ప్రభావంతో రానున్న కాలంలో మరిన్ని లేఆఫ్స్ ఉండే ప్రమాదం పొంచి ఉందని కూడా వారు నమ్ముతున్నారు.