2024లో ఉద్యోగాలను తొలగించిన ప్రముఖ టెక్ కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ కూడా చేరింది.ఇటీవల 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన మైక్రోసాఫ్ట్.. తన కంపెనీ ఉద్యోగుల్లో 1900 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ గేమింగ్ విభాగం నుంచి ఈ తొలగింపులు ఉంటాయని తెలిపింది. గేమింగ్ విభాగంలో ప్రస్తుతం 22 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ వారంలోనే తొలగింపులు అమల్లోకి వస్తాయని ఉద్యోగులకు మెమో జారీ చేసింది మైక్రోసాఫ్ట్.
2024లో ఉద్యోగుల కోతల అమలులో గూగుల్, అమెజాన్, డ్యుయోలింగో, టిక్ టాక్ వంటి టెక్ దిగ్గజాల ర్యాంకులో చేరింది. ఈ కంపెనీలన్నీ కేవలం 20నుంచి 25 రోజుల తక్కువ టైంలో లేఆఫ్స్ ప్రకటించాయి. ఇటీవల కాలంలో యాక్టివిజన్ బ్లిజార్డ్ ను కొనుగోలు చేసిన వెంటనే తన కంపెనీ ఉద్యోగుల తొలగింపులను చేపట్టింది మైక్రోసాఫ్ట్.