ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. గత రెండేళ్లుగా ఐటీ కంపెనీల్లో లక్షల్లో వర్క్ ఫోర్స్ లేఆఫ్స్ జరిగింది. టెక్ రంగంలో దిగ్గజ కంపెనీలు సైతం తన ఉద్యోగుల్లో అధిక శాతం తొలగింలు చేపట్టాయి. 2024 ప్రారంభం నుంచే ఈ ఐటీ పరిశ్రమల్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. గడిచిన నాలుగు నెల్లలోనే దాదాపు లక్ష ఉద్యోగాలు తొలగించాయి కంపెనీలు. తాజాగా ఒక్క మేనెలలో 9 రోజుల్లోనే 2వేల మంది టెకీలను కంపెనీలు తొలగించాయంటే ఇక మున్ముందు ఇంకా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారోనని ఆందోళన టెకీల్లో ఆందోళన మొదలైంది.
రాబోయే రోజుల్లో మరిన్ని లేఆఫ్స్ ఉంటాయా?
పెరుగుతు లేఆఫ్స్ సంఖ్యను చూస్తే.. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున్న టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తాయా అనే సంకేతాలు వస్తున్నాయి. గత వారం టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్స్ సెక్టార్లలో ఈ లేఆఫ్స్ నమోదు అయ్యాయి.
మే నెలలో యూఎస్ లోని ఒరిగాన్ కు చెందిన వకాసా కంపెనీ అత్యధికంగా లేఆఫ్స్ చేపట్టింది. కంపెనీ తన వర్క్ ఫోర్స్ లో 13 శాతం అంటే 800 మంది ఉద్యోగులకు ఉద్యాసన పలికింది. కంపెనీ పునర్వవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగించిందట. శాన్ డియాగో కు చెందిన హెల్త్ టెక్ కంపెనీ తన ఉద్యోగుల్లో 230 మందికి పింక్ స్లిప్ సర్వ చేసింది. ఇది ఆ కంపెనీ ఉద్యోగుల్లో సగం.
ఇండియాలో కూడా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. అన్ అకాడమీలో భాగమైన ప్రెప్ లాడర్ తన కంపెనీ ఉద్యోగుల్లో 25 శాతం అంటే 145 మందని తొలగించింది. దీంతోపాటు బెంగళూరు కు చెందిన ఫిన్ టెక్ కంపెనీ కూడా తన వర్క్ ఫోర్స్ నుంచి 15 శాతం( 100) ఉద్యోగులను తొలగించింది.
ఉద్యోగుల తొలగింపు కారణాలు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం.. టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణంగా చూపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలు సైతం నిర్వ హణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇదొక మార్గంగా చూపుతున్నాయి. కోవిడ్ పాండమిక్ తర్వాత మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలు కూడా ఇందుకు మరో కారణంగా చెబుతున్నాయి. ముఖ్యంగా ట్రావెలింగ్, ఫిట్ నెస్ పరిశ్రమల్లో నిర్ధిష్ట సేవలు, ప్రాడక్టులకు డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణం అంటున్నాయి. వకాసా కంపెనీ సిబ్బందిని తొలగించడానికి ఇదే కారణమట.