ఐటీలో ఏం జరుగుతుంది : డెల్ కంపెనీలో 12 వేల 500 మంది ఉద్యోగుల తొలగింపు

ఐటీలో ఏం జరుగుతుంది : డెల్ కంపెనీలో 12 వేల 500 మంది ఉద్యోగుల తొలగింపు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI ఎఫెక్ట్ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిన్నా మొన్నటి వరకు వందల సంఖ్యలో తొలగింపులు.. ఇప్పుడు వేల సంఖ్యకు చేరాయి. ప్రముఖ కంప్యూటర్స్ తయారీ సంస్థ డెల్ కంపెనీ.. ఒకేసారి.. ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులను తీసివేయాలని డిసైడ్ అయ్యింది. 10 శాతం అంటే.. 12 వేల 500 మంది ఉద్యోగులు. ఈ విషయాన్ని డెల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అంతర్గత సమాచారం కింద.. ఉద్యోగులకు తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

డెల్ కంపెనీ 12 వేల 500 మంది ఉద్యోగులను తొలగించటానికి కారణాలు ఏంటీ అనేది స్పష్టంగా చెబుతోంది. AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డేటా సెంటర్ ను ఆధునీకరిస్తున్నారు. ఏఐపై దృష్టి పెట్టే వ్యూహంలో భాగంగా.. కంపెనీ తన మ్యాన్ పవర్ తగ్గిస్తుందని.. ఏఐ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కస్టమర్లకు అందించటమే దీని ఉద్దేశం అంట. ఈ క్రమంలోనే మార్కెటింగ్, ఇతర కస్టమర్ సర్వీస్ విభాగాల్లోని 12 వేల 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు మెమో జారీ చేసింది. 

కంపెనీ నిర్ణయంపై ఉద్యోగులు షాక్ అయ్యారు. డెల్ కంపెనీ తొలగింపులను బ్లడ్ బాత్.. రక్త కన్నీరుగా అభివర్ణించారు. అంతే కాదు.. కంపెనీ చెబుతున్నట్లు తొలగిస్తున్నది 12 వేల 500 మందిని కాదని.. 2024, జనవరి నుంచి ఆగస్ట్ ఒకటో తేదీ వరకు 24 వేల 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు డెల్ మాజీ ఉద్యోగి ఆర్మ్ స్ట్రాంగ్ వెల్లడించారు. గత ఏడాది అంటే 2023లోనూ కంపెనీ 13 వేల మంది ఉద్యోగులను తొలగించిందని.. ఈ వివరాలు బయటకు రాలేదంటూ మరో ఉద్యోగి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Also Read :- ఇంటర్‌తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

అమెరికాలోనే అతి పెద్ద ఐటీ కంపెనీగా ఉన్న డెల్ లో ఇలాంటి పరిస్థితి తలెత్తటంతో.. మిగతా ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా ఉందని.. రాబోయే రెండేళ్లలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి అయితే డెల్ కంపెనీ లే ఆఫ్స్ ఐటీ రంగంలో సంచలనంగా మారాయి.