ఆరు రోజుల్లోనే.. 15 వేల ఐటీ ఉద్యోగాలు పోయాయి

ఆరు రోజుల్లోనే.. 15 వేల ఐటీ ఉద్యోగాలు పోయాయి

గత కొన్నేళ్లుగా ఉద్యోగుల తొలగింపులు టెక్ పరిశ్రమను కుదిపేస్తోంది. టెక్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా 2023లో పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. 2024లో కూడా లేఆఫ్స్ పరంపర కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల గూగుల్ తన ఉద్యోగుల తొలగింపులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ఫాబెట్ కంపెనీ తన అన్ని డిపార్టుమెంట్ లనుంచి ఉద్యోగులను తొలగించింది. ఇప్పటివరకు 186 టెక్ కంపెనీలు 49వేల 386 మంది ఉద్యోగులను తొలగించాయి. 

2024 జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో టెక్ ఉద్యోగుల లేఆఫ్స్ తగ్గుదల ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు టెక్ నిపుణులు. అయితే లేఆఫ్స్  పరంపరకు అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఆర్థిక అస్థిరత,వ్యాపారాల్లో వేగంగా చోటుచేసుకుంటున్ ప్రాధాన్యతల దృష్ట్యా ఉద్యోగుల తొలగింపుల తంతు కొనసాగుతోందంటున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు రకరకాల అంతర్గత పునర్నిర్మాణానికి లోనవుతున్నాయి. ప్రాధాన్యత ను బట్టి వ్యాపారాల్లో మార్పులు, కంపెనీల్లో కొన్ని విభాతాలు, ప్రాజెక్టుల తొలగింపులు ఉద్యోగుల కోతలకు కారణమవుతున్నాయి. 
జర్మన్ సాఫ్ట్ వేర్ కంపెనీ SAP 2024 జనవలోని తన పునర్నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. ఫలితంగా దాని సిబ్బందిలో 7 శాతం పైగా అనగా 1లక్షా 08వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని ప్రకటించింది. క్లౌడ్ సెంట్రిక్ గా మారాలనే లక్ష్యంతో కంపెనీ AI ద్వారా పాక్షికంగా దాని వృద్ధిని వేగవంతం చేయాలని చూస్తోంది. దీంతోపాటు ఎక్స్ పీడియా గ్రూప్ తన ఖర్చులను క్రమబద్దీకరించే ప్రయత్నంలో 1500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 

ఆర్థిక మాంద్యం 

టెక్ స్టాక్ ధరలలో సాధారణ క్షీణత, ఆర్థిక మాంద్యం కూడా ఉద్యోగుల తొలగింపులకు మరో కారణం. ఇది కంపెనీలను ముందు జాగ్రత్త పడేలా చేస్తోంది. ఇది తొలగింపులకు దారితీస్తుంది. వ్యాపారంలో నష్టాలు, టెలికమ్యూనికేషన్ లో మందగించిన డిమాండ్ తో కూడిన వివిధ కారణాల వల్ల ఐటీ కంపెనీ సిస్కో దాని 4250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించింది. 
ఫైనాన్షియల్ పెర్మా్ర్మెన్స్ మెరుగు పర్చడం .. 

తగ్గిన పేరోల్ ఖర్చులను పరిగణనలోకి తీసుకొని తొలగింపులు నేరుగా కంపెనీ లాభాల మార్జిన్ ను మెరుగు పరుస్తాయని కంపెనీలు నమ్ముతున్నాయి. పెట్టుబడిదారులు సాధారణంగా అధిక లాభాల మార్జిన్ లను కలిగి ఉన్న కంపెనీలను ఇష్టపడతారు. ఇలాంటి సందర్భంతో ఉద్యోగుల కోత కంపెనీల విలువను పెంచుతాయని వారి నమ్మకం .  వృద్ది ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడి కోసం ఆదా చేరసి ఖర్చులు పెట్టడంతో లాభాలు పెరిగాయి.  ఈ లాజిక్ తోనే లండన్ కు చెందని లగ్జరీ ఈటెయిలర్  ఫర్పెచ్ .. ఫిబ్రవరి 16న తన సిబ్బందిలో 2వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.