రెడీ అవుతున్న టెక్ మహీంద్రా
పుణే: రాబోయే రోజుల్లో బ్లాక్ చెయిన్ , సైబర్ సెక్యూ-రిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి డిజిటల్ టెక్నాలజీ సేవల వ్యాపారం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా భావిస్తోంది. తమ కంపెనీ ఆదాయంలో సగం ఆదాయం ఈ విభాగం నుంచే సంపాదించాలని లక్ష్యంగా నిర్దే శించుకుంది. ఇందుకోసం తమ ఐటీ ఉద్యోగుల్లో 70 శాతం మందికి డిజిటల్ స్కిల్స్ లో శిక్షణ ఇప్పించినట్టు తెలిపింది. ఐటీ ఉద్యోగులకు ఆధునిక టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చేందుకు నాస్కామ్ ‘ఫ్యూచర్ స్కిల్స్ ’ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థతో టెక్ మహీంద్రా చేతులు కలిపింది. ‘‘ప్రత్యర్థి కంపెనీల కంటే కొత్త నైపు-ణ్యాలను అలవర్చుకోవడంలో మేం ముందుంటాం . ‘టెక్ మహీంద్రా నెక్స్‌ట్ ’ కార్యక్రమం కోసం మేం భారీగా పెట్టుబడులు పెడుతున్నాం . 70 శాతం మంది ఉద్యోగులకు బ్లాక్ చెయిన్ , సైబర్ సెక్యూరి టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్, రోబోటి-క్స్ , ఆటోమేషన్ , 5జీ వంటి డిజిటల్ టెక్నాలజీలను నేర్పించాం . ఇందుకోసం నాస్కామ్ తో కుదుర్చుకున్న ఒప్పం దం ఎంతో దోహదపడింది. ఇక నుంచి మా కంపెనీ ఆదాయంలో సగం డిజిటల్ సేవల నుంచే సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం . వార్షికంగా 30 శాతం వృద్ధిని కొనసాగిస్తాం’’ అని టెక్ మహీంద్రా గ్రోత్ హెడ్ అండ్ సీఈఓ జగదీశ్ మిత్రా చెప్పా రు. డిజిటల్, ఆటోమేషన్ , వెర్టికలైజేషన్ , ఇన్నోవేషన్ , డిస్రప్షన్ (డేవిడ్) విధానంతో కస్టమర్లకు మరింత సమర్థం గా సేవలు అందిస్తామని అన్నారు.
పెద్ద ఎత్తు న ఖర్చు..
అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెం దిన ఎడ్‌క్యా స్ట్ భాగస్వామ్యం తో ఫ్యూచల్ స్కిల్స్ నడుస్తోంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి సొల్యూషన్స్ తయారు చేయడానికి టెక్ మహీంద్రా బ్లాక్‌చెయిన్ సెం టర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ను కూడా ఏర్పాటు చేసిం ది. భవిష్యత్‌లో కీలకంగా మారబోయే టెక్నాలజీలపై ఉద్యోగులు పట్టు సంపాదిం చేలా చేయడానికి ఈ కంపెనీ ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ రూపొందిస్తోంది. ఇందుకోసం ఉమ్మడిగా పరిశోధన చేయడానికి వివిధ యూనివర్సిటీలతో ఒప్పందా లు కుదుర్చుకుంటోంది. ఉద్యోగుల శిక్షణా కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. ‘‘ఇప్పుడు అన్ని కంపెనీలూ కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మారడం తప్పనిసరి. ఉద్యోగులకు ఇలాంటి వాటిపై శిక్షణ ఇప్పించడం ఆర్థిక పోటీకి చాలా ముఖ్యం . బ్లాక్ చెయిన్ , సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ , ఆటోమేషన్ , 5జీ వంటి టెక్నాలజీలతో రెడీగా ఉన్న కంపెనీలే ఐటీ పరిశ్రమకు కీలకంగా మారుతాయి. కొత్త టెక్నాలజీలపై శిక్షణకు ప్రభుత్వం కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తోంది. భవిష్యత్ టెక్నాలజీల సాయంతో ఉద్యోగులు ఆర్థిక వ్యవస్థను ముం- దుకునడిపిం చేలా వారికి మేం శిక్షణ ఇస్తాం’’ అని నాస్కామ్ ఐటీ–ఐఈఈఎస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ అమిత్ అగర్వాల్ వివరించారు.
‘‘టెక్ మహీంద్రా టెక్నాలజీలకు అత్యం త ప్రాధాన్యం ఇస్త ుంది. కొత్త టెక్నాలజీలపై ఉద్యోగులకు పట్టు కలిగేలా రూపొందిం చిన‘టెక్ మహీంద్రా నెక్ట్స్ ’ కార్యక్రమం కోసం మేం భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. మా కంపెనీలో 70 శాతం మంది ఉద్యోగులకు బ్లాక్ చెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్ , రోబోటిక్స్ , ఆటోమేషన్, 5జీ వంటి డిజిటల్ టెక్నాలజీలను నేర్పి స్తున్నాం. ఇందుకోసం నాస్కామ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో దోహదపడింది.
‑ జగదీశ్ మిత్రా
టెక్ మహీంద్రా గ్రోత్ హెడ్ అండ్ సీఈఓ