జ్యోతినగర్, వెలుగు: ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి హైస్కూల్లో మంగళవారం సైన్స్ ఫెయిర్ టెక్ నోవా– 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు తయారుచేసిన ప్రాజెక్ట్‌లను సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించారు. ఎన్టీపీసీ మోడల్ ప్రాజెక్ట్, సింగరేణి ఓపెన్ కాస్ట్, రిమోట్ కంట్రోల్ కారు, చంద్రయాన్ మోడల్ప్రాజెక్ట్, తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
రామగుండం ఎంఈవో గడ్డం చంద్రయ్య, విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, ట్రస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కంది రవీందర్‌రెడ్డి, పి.అంజారెడ్డి, సమ్మారావు, నోయల్ జోసెఫ్, తిరుపతిగౌడ్, ప్రవీణ్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.