టెక్నాలజీ ఆధునికీకరణ ప్రస్తుత ప్రపంచంలో ఎంతో మార్పును తెచ్చిపెట్టింది. దైనందిన జీవితంలో సాంకేతికత ప్రవేశించడం వల్ల మనుషులనే కాకుండా జంతువులను కూడా కొంతమేరకు ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది. మానవులు ఇప్పటికే సాంకేతికతకు అనుగుణంగా మారుతుండగా.. కోతులు కూడా తామేం వెనుకబడి లేమని నిరూపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక హాస్యభరితమైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక లంగూర్ కంప్యూటర్ కీబోర్డుపై నొక్కుతున్నట్టు కనిపిస్తుంది.
Also Read :నారియల్ పానీ ఇడ్లీ.. వీలైతే మీరూ ట్రై చేయండి
ఫేస్‌బుక్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోలో కంప్యూటర్ ముందు కూర్చున్న లంగూర్, టైప్ చేస్తున్నట్లు కనిపించింది. ఒక వ్యక్తి డెస్క్ వద్ద కూర్చొని తన కర్తవ్యాన్ని నిర్వర్తించే విధంగానే ఈ జంతువు కూడా కనిపించడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్ విచారణ కార్యాలయంలో జరిగిన సంఘటనగా తలుస్తోంది. కానీ దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు.
ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. "ఎంక్వైరీ స్పెషలిస్ట్ తన డ్యూటీని నిర్వర్తిస్తున్నాడు", "కొత్త రిక్విప్‌మెంట్ స్టేషన్ మాస్టర్" అంటూ వారు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 3వేల 4వందల వ్యూస్ రాగా, అనేక లైక్స్ వచ్చాయి.