టెక్ స్టార్టప్‌‌‌‌లలోకి రూ.21,500 కోట్ల పెట్టుబడులు

 టెక్ స్టార్టప్‌‌‌‌లలోకి రూ.21,500 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చి(క్యూ1) క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్  టెక్ స్టార్టప్‌‌‌‌లు 2.5 బిలియన్ డాలర్లు (రూ.21,500 కోట్లు) సేకరించాయి. ఇది కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 8.7 శాతం, అక్టోబర్‌‌‌‌‌‌‌‌–డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 13.64 శాతం ఎక్కువ. మార్కెట్ ఇంటెలిజెన్స్  ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ట్రాక్సన్ రిపోర్ట్ ప్రకారం, యూఎస్‌‌‌‌, యూకే తర్వాత ఎక్కువ స్టార్టప్‌‌‌‌ ఫండింగ్ అందుకున్న దేశంగా ఇండియా నిలిచింది. 

ఆటోటెక్‌‌‌‌, ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌ అప్లికేషన్స్‌‌‌‌, రిటైల్ సెక్టార్లలోని టెక్ స్టార్టప్‌‌‌‌లు ఎక్కువ ఫండ్స్ పొందాయి. లేట్ స్టేజ్ స్టార్టప్‌‌‌‌లకు ఫండింగ్ పెరగగా,  ఎర్లీ, సీడ్ స్టేజ్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లకు మాత్రం తగ్గాయి. లేట్‌‌‌‌ స్టేజ్ స్టార్టప్‌‌‌‌లు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 1.8 బిలియన్ డాలర్లు  అందుకోగా, ఇదే టైమ్‌‌‌‌లో సీడ్ స్టేజ్ స్టార్టప్‌‌‌‌లు 157 మిలియన్ డాలర్లు, ఎర్లీ స్టేజ్ స్టార్టప్‌‌‌‌లు 528 మిలియన్ డాలర్లు పొందాయి. కానీ,  క్యూ1లో ఒక్క యూనికార్న్ స్టార్టప్‌‌‌‌ కూడా క్రియేట్ కాలేదు. కిందటేడాది క్యూ1లో రెండు యూనికార్న్‌‌‌‌లు క్రియేట్ అయ్యాయి.