బెంగళూరులో టెకీ ఆత్మహత్య..న్యాయం జరగాలి అని ప్లకార్డు వేలాడదీసీ..

బెంగళూరులో టెకీ ఆత్మహత్య..న్యాయం జరగాలి అని ప్లకార్డు వేలాడదీసీ..

బెంగళూరులో ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు..ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయాడు.. దాదాపు 24 పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. న్యాయం జరగాలి అంటూ..అతని బలవన్మరణం వెనక కారణాలు ఒక్కొక్కటిగా చెపుతూ ప్లకార్డులు వేలాడ దీసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు..బెంగళూరులో టెకీ ఆత్మహత్య చేసుకున్న టెకీ ఆత్మహత్యకు కారణం ఎవరు..ఉన్నత చదువులు చదివి.. మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ప్రాణం తీసుకునేందుకు ప్రోత్సహించిన పరిస్థితులేంటీ..?

సోమవారం (డిసెంబర్10) 34యేళ్ల యూపీకి చెందిన టెకీ సుభాష్ .. బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. సుభాష్ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. 

సుభాష్ గత కొంతకాలంగా భార్యతో విడిగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కోర్టుకెక్కారు. ఈ విషయంలో సుభాష్ తన భార్యకు నెలకు 40వేల ఆమెకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ప్రతినెలా 40వేలు చెల్లిస్తూనే ఉన్నాడు. 

Also Read :- నెలలో మూడున్నర కోట్ల విలువైన 1100 ఫోన్లు రికవరీ

సోమవారం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న సుభాష్ తన ప్లాట్ లో ఉరివేసుకొని చనిపోయాడు.. ప్రాణం తీసుకునే ముందు 24 పేజీలు సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఆ సూసైడ్ నోట్ లో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. 

సుభాష్ తన సూసైడ్ నోట్ లో తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని.. ఇప్పటికే నెలకు రూ. 40వేలు చెల్లిస్తున్నప్పటికీ ఇంకా కావాలని డిమాండ్  చేస్తున్నారని నోట్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

సుభాష్ ఆత్మహత్య కు ముందు సుభాష్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను సంపాదించే డబ్బు తన శత్రువులు బలపడటానికి సహాయపడుతుందని చెప్పాడు. ‘‘నేను నా జీతంపై చెల్లించే డబ్బులతో నన్ను , నా కుటుంబాన్ని వేధించడానికి పోలీసులకు, లాయర్లకు అందిస్తోందని ఆరోపించారు సుభాష్. 

సుభాష్ ఆత్మహత్య కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.