స్టాక్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ ఫేక్ యాప్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ .. రూ12.85 లక్షలు ఫ్రాడ్

స్టాక్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ ఫేక్ యాప్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ .. రూ12.85 లక్షలు ఫ్రాడ్
  • సిటీకి చెందిన ప్రైవేటు ఎంప్లాయ్ ని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు  

బషీర్ బాగ్,వెలుగు : స్టాక్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ లో ఇన్వెస్ట్ మెంట్ పేరిట ఓ ప్రైవేట్ ఎంప్లాయ్ ని సైబర్ నేరగాళ్లు మోసగించారు. హైదరాబాద్ సిటీ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ లో స్టాక్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ వీడియో చూడగా.. ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. అతడు వీడియో లింక్ పై క్లిక్ చేయగా.. 'జూపిటర్‌‌‌‌‌‌‌‌ అసెట్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్, ఇండియా వాట్సాప్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో యాడ్‌‌‌‌‌‌‌‌ అయింది.

అనంతరం బాధితుడి వ్యక్తిగత డేటా తీసుకుని   ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ ఫేక్ యాప్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌ చేయించారు. ఆపై గోకాక్‌‌‌‌‌‌‌‌ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌కు చెందిన 154 షేర్లను కొనుగోలు చేయించి.. 5 శాతం లాభం వచ్చినట్లు చూపించారు. అదేవిధంగా ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఎమల్సి ఫైయర్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ఐపీవో సబ్‌‌‌‌‌‌‌‌స్క్రైబ్‌‌‌‌‌‌‌‌ చేయించి.. సుమారు 150 శాతం లాభం వస్తుందని చెప్పి అలాగే చూపించారు.వచ్చిన లాభంలో తమకు 30 శాతం చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా అతడి నుంచి రూ.12. 85 లక్షలు లాగేశారు.

అనంతరం బాధితుడు తన డబ్బును విత్‌‌‌‌‌‌‌‌ డ్రా చేసుకోవాలని చూస్తే..  విత్‌‌‌‌‌‌‌‌ డ్రా కాదని మెసేజ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. దీంతో మోసపోయిన బాధితుడు సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌ పోలీసులను కంప్లయింట్ చేయగా కేసు ఫైల్ చేశారు. స్టాక్​ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శివమారుతి సూచించారు.