
Education Loan: నేటి కాలంలో సమాజంలో పక్కవారితో లేదా మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారితో జీవితాలను సర్వసాధారణంగా మారిపోయింది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కోరికలను కాదనకుండా అప్పుచేసి మరీ వారిని చదివించాలని చూస్తున్నారు. అయితే ఇది తప్పుకానప్పటికీ.. ఇలాంటి వాటి వల్ల కుటుంబాలు ఎలా కుధేలవుతున్నాయనే నిజాలను ఒక భారతీయ టెక్కీల బయటపెట్టాడు. ఈ క్రమంలో తన అనుభవాలను సామాజిక మాధ్యమం రెడిట్ ద్వార్ బయపెడుతూ చాలా మందికి అవగాహన కలిగిస్తున్నాడు.
సగటు భారతీయ యువకుడి మాదిరిగానే అతడు కూడా అమెరికా వెళ్లాలి, అక్కడ చదువు పూర్తి చేసి స్థిరపడాలని కలలు కన్నాడు. దీనికోసం భారీ మెుత్తంలో అమెరికాలో చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాడు. మాస్టర్స్ చేసిన తర్వాత అక్కడ ఉద్యోగం దొరకకపోవటం, దానికి తోడు వీసా రూల్స్, ఇంటర్న్ షిప్స్ భారతీయ విద్యార్థులకు లేకపోవటంతో వెనుదిరగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ జర్నీ తన జీవితంలో రూ.40 లక్షల భారీ అప్పును మాత్రమే మిగిల్చిందని అతడు వాపోయాడు.
Also Read :- ఛావా సినిమాపై రాజ్ థాక్రే సంచలన కామెంట్స్
అయితే భారత్ తిరిగి వచ్చేసిన అతడు ప్రస్తుతం నెలకు రూ.75 వేల వేతనంతో ఉద్యోగం పొందాడు. కానీ ఇందులో రూ.66 వేలు నెలకు ఈఎంఐ చెల్లింపులకు పోగా రూ.9 వేలు మిగులుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అమెరికా వెళ్లిన తాను చివరికి అప్పుల ఊబిలో చిక్కుకుపోయానని, ఇప్పుడు తనకు ఏం చేయాలో పాలుపోవటం లేదని తన రెడిట్ పోస్టులో వెల్లడించాడు.
తన తండ్రి చిన్న వ్యాపారం చేస్తున్నారని, అయితే తన కలలను నిజం చేసుకోవటానికి, మంచి భవిష్యత్తు కోసం తాహతకు మించి ఆర్థికంగా తనకు అండగా నిలబడ్డారని సదరు టెక్కీ ఎమోషనల్ అయ్యాడు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేస్తే ఆతర్వాత అక్కడే డాలర్లు కురిపించే ఉద్యోగాలు వస్తాయని చాలా మంది భారతీయ యువత భావిస్తుంటారు. కానీ పరిస్థితులు వాస్తవంగా దీనికి చాలా దూరంగా ఉన్నాయని టెక్కీ వెల్లడించాడు. ఈ క్రమంలో తాను ఏడాది పాటు అమెరికాలో అనేక ఉద్యోగాల కోసం అప్లై చేసినట్లు కూడా పేర్కొన్నాడు. ఈ క్రమంలో కనీస అవసరాలు, నివాస ఖర్చులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ టెక్కీ చెప్పిన విషయాలు అమెరికాలోని జాబ్ మార్కెట్లు, ఇమ్మిగ్రేషన్ సమస్యలపై చాలా మందికి కనువిప్పుగా మారాయి. అలాగే ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికన్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరగటం కూడా బయటి దేశాల వారికి ఉద్యోగం పెద్ద కలగా మార్చేస్తున్నాయి.
దీనిపై యూజర్లు సానుకూలంగా స్పందనలు తెలిపారు. కొందరు ఉన్నత ప్యాకేజీ ఆఫర్ చేసే ఉద్యోగాలకు మారాలని సూచిస్తుండగా.. మరొకరు స్కిల్స్ పెంచుకోటవం ద్వారా అనుకున్న శిఖరాలకు చేరుకోవటం కష్టమైనదేమీ కాదంటూ టెక్కీకి సూచిస్తున్నారు. అయితే సదరు టెక్కీ పార్ట్ టైమ్స్ నుంచి ఎన్జీవోలను సంప్రదించటం వరకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తనకు ఎలాంటి ఉపశమనం లబించలేదని పోస్టులో పేర్కొన్నాడు.