
టెకీగా అమెరికాలో తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియెన్స్..పైగా సాఫ్ట్‌వేర్ డెవలపర్.. మిచిగాన్ యూనివర్సిటీనుంచి డిగ్రీ. స్టాక్ డెవలప్మెంట్లో పూర్తిస్థాయి అనుభవం.ఇంత అనుభవం ఉన్నా తనకు భారతదేశంలో ఉద్యోగం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్..తన బాధను రెడ్డిట్ పోస్ట్‌లో చేశాడు. వివరాల్లోకి వెళితే..
12యేళ్లుగా అమెరికా ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. తల్లిదండ్రులకోసం ఇండియాకు తిరిగి రావాలనుకుంటున్నాడు.. అయితే ఇండియాలో ఉద్యోగం కోసం గత ఆరు నెలలుగా దరఖాస్తులు చేస్తూనే ఉన్నాడు.. ఇంత అనుభవం ఉన్నప్పటికీ తనకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రెడ్డిట్ లో పోస్ట్ షేర్ చేశాడు.. ఇది వైరల్ అయింది.
తల్లిదండ్రులు వృద్దులు కావడంతో వారిని చూసుకునేందుకు తాను ఇండియాకు వస్తున్నట్లు తెలిపాడు. అమెరికాకు వారిని తీసుకెళదామంటే తనకు గ్రీన్ కార్డు రావడడానికి ఇంకా పదిహేనేళ్లు పడుతుంది.. ఈ లోపు వారిని చూసుకునేందుకు ఎవరు లేరు. కాబట్టి ఇండియాకు రావాల్సి వస్తోందని చెప్పాడు.
తన అనుభవం గురించి చెబుతూ US లో ఫుల్ స్టాక్ S/W డెవలపర్‌గా 2 యూనివర్సిటీలో 9యేళ్లుగా పనిచేస్తున్నారు. పైథాన్, జాంగో (జాంగో REST తో పాటు), జావాస్క్రిప్ట్, Vue.js, లలో అనుభవం ఉంది. వెబ్ అప్లికేషన్లు, డేటా పైప్‌లైన్లు,డేటా విజువలైజేషన్లను నిర్మించినట్లు తెలిపాడు.
సోషల్ మీడియా ద్వారా సలహా కోరుతూ.. "రాబోయే 6 నెలల్లో నా స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసి, ఆపై ఉద్యోగాల కోసం ప్రయత్నించాలా? ఏదైనా సలహా ఇవ్వగలరు అని రాశాడు ఆ టెకీ.
టెకీ పోస్ట్ కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. భారత్లో భయంకరమైన పోటీ ఉంది. మీకు రిఫరెన్స్ లేకపోతే కష్టమే అని ఓ నెటిజన్ సమాధానమిచ్చాడు..
మరో నెటిజన్ స్పందిస్తూ.. భారత్ లో ఉద్యోగానికి బదులుగా.. అమెరికాలో రిమోట్ ఎంప్లాయీగా ట్రై చేయండి.ఆ విధంగా మీరుకావాల్సిన చోట పనిచేసుకోవచ్చు. అలాంటి అవకాశం ఉందో లేదో వెదకండి అని రాశాడు.
ఏదీ ఏమైనా అమెరికాలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా భారత్ లో ఉద్యోగాలు రావడం లేదంటే..ఐటీలో ఉద్యోగాల్లో పోటీ, స్కిల్స్ అతనిపై ప్రభావం ఉందని నెటిజన్ల డిస్కషన్ చెప్పకనే చెపుతుంది.