
దేశీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు వరస నష్టాలను చవిచూస్తున్నాయి. శుక్రవారం భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ప్రారంభంలో కొంత లాభప డినట్లు కనిపించినా రోజంతా తగ్గుతూ, పెరుగుతూ. చివరికి నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్ షేర్లు అమ్మకాలు జరిగాయి. అయితే ఐటీ కంపెనీల షేర్లు మాత్రం లాభపడ్డాయి. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ ఏడు రోజుల వరస నష్టాలకు తెరదించేశాయి.
సోమవారం (మార్చి3) స్టాక్ మార్కెట్లో టెక్ మహీంద్రా, విప్రో,ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల షేర్లు 3 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.6 శాతం పెరిగి ఈరోజు ట్రేడింగ్‌లో అత్యధిక లాభాలు పొందినది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లోని పది కంపెనీలలో తొమ్మిది కంపెనీలు లాభపడ్డాయి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ మాత్రమే1 శాతానికి పైగా క్షీణించింది. ఇన్వెస్టర్లు టెక్నాలజీ స్టాక్‌లను బాగా కొనుగోలు చేశారు. అయితే ఈ లాభాలను ట్రెండ్ రివర్సల్‌కు సంకేతంగా కాకుండా ఓవర్‌సోల్డ్ నుంచి టెక్నాలజీ పుంజుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ALSO READ | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు : ట్రంప్ ఎఫెక్టేనా.. ఇప్పట్లో లాభాలు వచ్చే పరిస్థితి లేదా..?
వ్యక్తిగత స్టాక్‌లలో టెక్ మహీంద్రా 2.93 శాతం పెరిగింది. వరుసగా ఏడు సెషన్ల క్షీణత తర్వాత తిరిగి పుంజుకుని NSEలో ఇంట్రాడే గరిష్ట స్థాయి స్టాక్ ధర రూ.1,531.5కి చేరుకుంది. విప్రో 3.13 శాతం పెరిగి రూ.286.35కి చేరుకోగా, ఇన్ఫోసిస్ 2.42 శాతం పెరిగి రూ.1,728.60కి చేరుకుంది.ఐటీ ఇండెక్స్ హెవీవెయిట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా 1 శాతానికి పైగా పెరిగి రూ.3,523.25కి చేరుకుంది.