ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు

ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు

ఇండియన్​ ఆర్మీ జనవరి 2025లో ప్రారంభమయ్యే 52వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్‌‌) కోర్సు శిక్షణలో  90 అడ్మిషన్స్​కు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. ఎంపికైనవారికి బీటెక్‌‌ కోర్సు, లెఫ్టినెంట్‌‌ కొలువులకు ఫ్రీ ట్రైనింగ్​ ఇస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

సెలెక్షన్​: జేఈఈ (మెయిన్స్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.

ట్రైనింగ్​: మొత్తం అయిదేళ్లు కోర్సు, ట్రైనింగ్​ కొనసాగుతుంది. ఇందులో ఏడాది బేసిక్‌‌ మిలిటరీ ట్రైనింగ్‌‌, నాలుగేళ్లు టెక్నికల్‌‌ ట్రైనింగ్‌‌ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీరింగ్‌‌ (బీఈ/ బీటెక్‌‌) డిగ్రీ అందజేస్తారు. అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.