దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో సాంకేతిక సమస్య తలెత్తింది. శనివారం (అక్టోబర్ 5) మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలైన సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలు, విమాన సేవలపైనా తీవ్ర ప్రభావం చూపింది. సాంకేతిక సమస్య కారణంగా పలు విమానాలు రద్దు కావడంతో పాటు మరికొన్నింటిని వివిధ మార్గా్లో దారి మళ్లించారు. టెక్నికల్ ఇష్యూ వల్ల ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో సర్వీస్‌లకు చెందిన చెక్-ఇన్‌లు నత్తనడకన సాగుతున్నాయి. చెక్-ఇన్ కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. టికెట్ బుకింగ్‌లు సైతం అవ్వడం లేదని ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :- కొరియోగ్రాఫర్ జానీకి మరో బిగ్ షాక్
సాంకేతిక లోపంపై ఇండిగో సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా రియాక్ట్ అయ్యింది. ‘‘మా నెట్‌వర్క్‌లు అన్నింటిలోనూ తాత్కాలికంగా వ్యవస్థలు నెమ్మదించాయి. మా వెబ్‌సైట్, బుకింగ్ సిస్టమ్‌పై ఈ ప్రభావం పడింది. సాంకేతిక లోపంపై మా టీమ్ పని చేస్తోంది. ప్రతి ఒక్కరికీ సహాయం చేయడంతో పాటు ప్రయాణాలు సాఫీగా సాగేందుకు అంకిభావంతో నిపుణుల బృందం పని చేస్తోంది. వీలైనంత త్వరగా సమస్యను గుర్తించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సీరియస్‌గా పని చేస్తున్నాం. ఈ సమయంలో మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ విజ్ఞప్తి చేసింది.