- మూడు బ్యారేజీలపై అధ్యయనం చేసిన కమిటీ
హైదరాబాద్, వెలుగు: డిజైన్లు, ఆపరేషన్ అండ్మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లో లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ తేల్చింది. ఈ మేరకు కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్కు సోమవారం రిపోర్టు ఇచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సాంకేతిక అంశాలను తెలుసుకునేందుకు నిపుణులతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని కమిషన్ ఆదేశించడంతో జేఎన్టీయూ ప్రొఫెసర్సి.బి.కామేశ్వర్రావు చైర్మన్‌గా ఈ ఏడాది మేలో ఎక్స్పర్ట్కమిటీని ఇరిగేషన్డిపార్ట్మెంట్నియమించింది.
ఈ కమిటీ పలుమార్లు దెబ్బతిన్న బ్యారేజీలను పరిశీలించింది. బ్యారేజీల డిజైన్లు, డీపీఆర్‌లు, బ్యారేజీల సైట్లలో నిర్వహించిన జియోటెక్నికల్స్టడీరిపోర్టులు, అక్కడ వరద పరిస్థితులు, నేల తీరు సహా అన్ని అంశాలపై అధ్యయనం చేసింది. డిజైన్ల విషయంలో పలు మార్పుచేర్పులు చేశారని కమిటీ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది. ‘‘సీకెంట్పైల్స్తో బ్యారేజీ నిర్మించినా సరైన మానిటరింగ్చేయలేదు. బ్యారేజీలను నిర్మించాక కనీసం ఆపరేషనల్ ప్రొటోకాల్‌ను తయారు చేయలేదు. వాటి నిర్వహణను పట్టించుకోలేదు. గేట్ల ఆపరేషన్‌ను ప్రొటోకాల్ ప్రకారం నిర్వహించలేదు” అని చెప్పినట్టు సమాచారం.
వచ్చే విడతలో ఐఏఎస్ ల విచారణ..
బ్యారేజీల విషయంలో బ్యూరోక్రాట్లను వచ్చే విడతలో కాళేశ్వరం కమిషన్విచారించనుంది. విచారణకు అవసరమైన డాక్యుమెంట్లను ఐఏఎస్‌లు సమర్పించలేదని, వాటిని సమర్పించాల్సిందిగా కమిషన్ఆదేశించిందని తెలిసింది. ఆ డాక్యుమెంట్లను ఐఏఎస్అధికారులు సమర్పించాక, అధ్యయనం చేసి దానికి అనుగుణంగా ఓపెన్‌కోర్టుకు వారిని పిలవాలని కమిషన్భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెల రెండో వారంలో తదుపరి దశ ఓపెన్కోర్టు విచారణను కమిషన్ నిర్వహించనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.