సైబర్ అటాక్... ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలు ఎదుర్కొంటున్న సెక్యూరిటీ సమస్య. ప్రజల వ్యక్తిగత డేటాతోపాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల రహష్య డేటాతో పాటు దేశ భద్రతకు సంబంధించిన ఇంపార్టెంట్ డేటాను సైబర్ అటాక్తో దొంగిలిస్తున్నారు. అయితే సైబర్ అటాక్లు అనేవి గూఢచర్యంతో అత్యధికంగా జరుగుతు న్నాయని టెక్ నిపుణులు అంటున్నారు.
2024లో APAC ప్రాంతం అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 25 శాతం సైబర్ అటాక్ లు గూఢచర్యం ద్వారా జరిగాయని అంటున్నారు టెక్ నిపుణులు. ఇది యూరప్, ఉత్తర అమెరికాతో పొల్చుకుంటే 4 నుంచి 6 శాతం ఎక్కువ.
వెరిజోన్ బిజినెస్ నివేదిక ప్రకారం..2024లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2,130 సెక్యూరిటీ ఇన్సిడెంట్స్, 523భద్రత ఉల్లంఘనలు జరిగాయి. సిస్టమ్ చొరబాటు, సోషల్ ఇంజనీరింగ్, ప్రాథమిక వెబ్అప్లికేషన్ దాడులు 95 శాతం జరిగాయని అంటున్నారు. 2023లో 30,458 భద్రతా సంఘటనలు, 10,626 ఉల్లంఘనలు నిర్ధారించబడ్డాయి. 2022 కంటే రెండు రెట్లు పెరిగింది.
గతేడాది డేటా కస్టోడియన్లు, థ్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ వైఫల్యం, ఇతర కారణాలంతో 15 శాతం సెక్యూరిటీ బ్రీచెస్ జరిగాయి. ఇందులో 68 శాతం బ్రీచెస్ థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్లు ఉన్నా లేకపోయినా..వ్యక్తిగత పొరపాట్ల వల్ల జరిగాయట.
అయితే భారత్ లో పిషింగ్ సైబర్ దాడులు ఎక్కువగా జరిగాయి. హానికరమైన లింకులు, అటాచ్ మెంట్ల పై క్లిక్ చేయడం వల్ల అనేకమంది సైబర్ అటాకర్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోయారని నివేదికలు చెపుతున్నాయి. అయితే సెక్యూరిటీ రిపోర్టింగ్ పద్దతులు అప్ డేట్ కావడంతో 20 శాతం భారతీయులు ఫిషింగ్ సైబర్ దాడులను గుర్తిస్తున్నారట.