హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటి మిట్ట దగ్గర వరకు వెళ్లిన తర్వాత సాంకేతిక లోపం కారణంగా మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్ నుండి ఉదయం 6: 35గంటలకు బయలుదేరి 7: 30గంటలకు తిరుపతి చేరుకోవాల్సి ఉంది.
సాంకేతిక లోపం వల్ల తిరిగి 8: 30గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. విమానంలో 66 మంది ఉన్నారు. సాంకేతికలోపం తలెత్తినా పరమాదమేమి జరగకపోవటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.