హైదరాబాద్‌సిటీ, వెలుగు : టెక్నికల్ ప్రాబ్లమ్తలెత్తడంతో మెట్రో వాటర్‌బోర్డు అధికారిక వెబ్సైట్శుక్రవారం మొరాయించింది. హ్యాక్అయ్యిందనే అనుమానంతో అధికారులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. గంటల పాటు రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలించి హ్యాక్ కాలేదని తెలిపారు.
సైట్ రీడైరెక్ట్ అవుతున్నట్టు గుర్తించారు. బోర్డు ఐటీ టీమ్‌తోపాటు, తెలంగాణ ఐటీ శాఖ నిపుణులు వెబ్సైట్రిసాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వాటర్‌బోర్డు ఎగ్జిక్యూటివ్డైరెక్టర్ మయాంక్ మిట్టల్ వెల్లడించారు. వెబ్‌సైట్‌లోని డేటా సురక్షితంగా ఉందన్నారు.